
📌 Key Points
- చర్లపల్లి – నాగర్‌కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.
- ఈ రైలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.
- రైలులో స్లీపర్, జనరల్ బోగీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బోగీలు ఉన్నాయి.
- తక్కువ ధరలో ఆధునిక సౌకర్యాలతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు.
హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి నాగర్‌కోయిల్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు మార్చి 11 నుండి అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించిన టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ కు సంబంధించి రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ్టి(మార్చి 11) నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి.ఈ ట్రైన్ కు సంబంధించిన టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ ఖరారు చేసింది.
చర్లపల్లి – నాగర్‌కోయిల్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్…. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఇందులో 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 11 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. 1 పాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ బోగీలు (దివ్యాంగులకు అనుకూలంగా) ఉంటాయి.
టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలు
ట్రైన్ నంబర్ 06357 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5:30 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయలుదేరుతుంది. గురువారం రాత్రి 11:45 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, పాపనాశం, కుంభకోణం, మైలాడుథురై, సర్కాజి, చిదంబరం, తిరుప్పాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, సూళ్లూరుపేట, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు
సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ ట్రైన్ ద్వారా పొందొచ్చు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. ఈ రైలు రాకపోకలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.


