
📌 Key Points
- చిరంజీవి సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- సినిమా ఫ్లాప్ అయితే తన తప్పేనని, ఇతరులపై వేయను అని చిరంజీవి అన్నారు.
- కొరటాల శివపై గతంలో వచ్చిన విమర్శలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిని చిరంజీవి ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విజయం సాధించిన సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా సక్సెస్ అయితే అందరిదీ, ఫెయిల్ అయితే తనదే బాధ్యత అని ఆయన అన్నారు.
చిరంజీవి తాజా వ్యాఖ్యలు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ (MSVPG)గారు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం వారం రోజులలోనే బ్రేక్ ఈవెన్ చేదించి లాభాలను అందుకుంది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం నేడు సక్సెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి ఇలాంటి సూపర్ సక్సెస్ అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాకు ఇలాంటి ఆదరణ అందించిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి నేను శిరస్సు వంచి వందనం చేస్తున్నానని చిరంజీవి తెలియజేశారు.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని చిత్ర బృందానికి డిస్ట్రిబ్యూటర్లకు ఇలా షీల్డ్ అందజేస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ద్వారా వింటేజ్ చిరంజీవిని మాత్రమే చూపించకుండా వింటేజ్ సెలబ్రేషన్స్ కూడా తీసుకువచ్చారని, ఈ ఘనత అనిల్ రావిపూడి దేనని తెలిపారు.. ఇలా ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన చిరంజీవి సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ అందరికీ ఇస్తానని తెలిపారు. అలా కాకుండా కొన్ని తప్పిదాల వల్ల సినిమా సక్సెస్ కాకపోతే ఆ తప్పు మొత్తం నా మీదే వేసుకుంటాను తప్ప ఇతరుల పైకి వెయ్యను అంటూ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు.
విమర్శలకు కౌంటర్?
ఇలా చిరంజీవి సినిమాపోతే ఆ తప్పు ఎవరిపై వేయను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో చిరంజీవి కొరటాలకు కౌంటర్ ఇచ్చారా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో చిరంజీవి తాము డైరెక్టర్ చెప్పినట్టే చేశాము అంటూ తప్పు మొత్తం డైరెక్టర్ మీదకు తోసారంటూ విమర్శలు వచ్చాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాలే కారణమని చిరంజీవి చెప్పారంటూ ఆయన పై విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే నేడు ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తూ మాట్లాడారని తెలుస్తుంది.
youtube.com/live/jhCZDh17SPI
చిత్ర బృందానికి అభినందనలు
ఇలా చిరంజీవి ఈ కార్యక్రమంలో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో భాగమైనందుకు విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. అదేవిధంగా చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇక అనిల్ రావిపూడి పై, ఆయన దర్శకత్వ ప్రతిభ పై కూడా చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాకు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించడంతో తన బిడ్డ విజయంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారో వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


