
📌 Key Points
- చిరంజీవి-బాబీ సినిమా KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఉండగా, ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం కావచ్చు.
- జన నాయకన్ సినిమా వివాదం కారణంగా KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో ఉంది.
- ప్రియమణి చిరంజీవి భార్యగా, కృతి శెట్టి కుమార్తెగా నటించే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి.
- కోర్టు తీర్పు తర్వాతే చిరంజీవి సినిమా ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాతో బిజీ అవ్వాలని అనుకున్నారు, కానీ KVN ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కారణంగా సినిమా ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా ఆలస్యానికి కారణం ఏంటి?
Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా తరువాత ప్రస్తుతం చిరంజీవి తదుపరి సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెగ వైరల్ అవుతుంది. వాల్తేరు వీరయ్య వంటి భారీ హిట్ తర్వాత, చిరంజీవి మరోసారి దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ)తో కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట ప్లాన్ ప్రకారం..చిరంజీవి..బాబీ సినిమా మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ పూర్తయిన వెంటనే మొదలవ్వాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్ మారింది. దీనికి కారణం KVN ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక, న్యాయపరమైన సమస్యలే. ముఖ్యంగా జన నాయకన్ సినిమా విషయంలో సీబీఎఫ్‌సీతో నడుస్తున్న న్యాయపోరాటం వల్ల నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
KVN ప్రొడక్షన్స్ సమస్యలు
ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు చిరంజీవి సినిమా ప్రారంభించలేకపోతున్నారని టాక్. ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ తమ దృష్టంతా జన నాయకన్ సినిమా సమస్యలపైనే పెట్టిందట. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి సినిమా ఆలస్యం కావచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితిలో నిర్మాతల ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జన నాయకన్ సమస్యలు పూర్తిగా తీరే వరకు వేచి చూడడం. రెండోది, లైన్ ప్రొడ్యూసర్‌ను తీసుకుని సహనిర్మాణం ద్వారా చిరంజీవి సినిమా షూటింగ్‌ను త్వరగా మొదలుపెట్టడం. ప్రస్తుతం మెగాస్టార్ క్రేజ్ బాగా ఉన్నందున, ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలుపెడితే మంచిదనే అభిప్రాయం కూడా ఉంది.
సినిమాలో నటీనటుల గురించి పుకార్లు
ఇంకా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి చిరంజీవి భార్య పాత్రలో కనిపించవచ్చని టాక్. అలాగే కృతి శెట్టి చిరంజీవి కుమార్తె పాత్ర కోసం చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఇప్పటికి ఊహాగానాలే. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. అప్పటివరకు చిరంజీవి అభిమానులు కాస్త ఓపికగా ఎదురు చూడాల్సిందే.
చిరంజీవి సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కోర్టు తీర్పు వచ్చాక అన్ని సమస్యలు తొలగిపోయి సినిమా త్వరగా మొదలవుతుందని ఆశిద్దాం.


