|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం

Published: 15-06-2025, 1:56 AM
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం

మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలలో ‘పున్నమినాగు’ ఒక ప్రత్యేకమైన చిత్రం. ఈ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఖైదీ చిత్రానికి ముందే విడుదలైన ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Key Points

1

చిరంజీవి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న 'పున్నమినాగు' చిత్రం.

2

ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి మేనక ఈ చిత్రంలో నటించారు.

4

60 రోజుల షూటింగ్‌తో, 30 రోజులు రాత్రి షూటింగ్‌తో చిత్రం పూర్తయింది.

చిరంజీవి నటనలో మరో మైలురాయి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కానీ ఫ్యాన్స్ ఎక్కువగా రికార్డులు సాధించిన చిత్రాలు గురించే చెప్పుకుంటారు. కానీ చిరంజీవిలోని అద్భుతమైన నటుడిని వెలికి తీసిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది. ఆ చిత్రం మరేదో కాదు.. పున్నమినాగు.

1980లో రిలీజైన ఈ మూవీలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. తన శరీరమంతా పాము విషం తో నిండిపోయి ఉంటుంది. దాని నుంచి బయటపడలేక వేదన పడుతూ చిరంజీవి నటించిన విధానం కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి, నరసింహ రాజు, మేనక, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్ మేనక ఎవరో కాదు.. ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి ఆమె.

పున్నమినాగు: ఒక అద్భుతమైన చిత్రం

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపు 30 రోజులు రాత్రి వేళల్లోనే షూటింగ్ కి హాజరయ్యారట. అప్పటికి ఇండస్ట్రీలో చిరంజీవి పెద్దగా అనుభవం లేని నటుడు.

అయినప్పటికీ పాము లక్షణాలు ఉన్న వ్యక్తిగా, కథ మొత్తం తన భుజాలపై మోస్తూ చిరంజీవి నటించిన విధానం ఆద్యంతం కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో చిరంజీవి విశ్వరూపం ప్రదర్శించారు. చిరంజీవి ఈ చిత్రంలో కళ్ళతోనే హావభావాలు పలికించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.

కీర్తి సురేష్ తల్లి మేనకతో చిరంజీవి రొమాన్స్

చిరంజీవిలోని నటనని బయటకు తీసిన పున్నమినాగు చిత్రం ఇటీవల 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనకి ప్రశంసలతో పాటు, ఆ తర్వాత హీరోగా మరిన్ని అవకాశాలు దక్కాయి.

చిరంజీవి నటనకు ప్రశంసలు అందుకున్న ‘పున్నమినాగు’ చిత్రం ఆయన కెరీర్‌లో మరపురాని మైలురాయి. ఈ చిత్రం ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.