
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి సినిమా రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు, కానీ లాభాలు రూ.44 కోట్లు మాత్రమే!
- వెంకటేష్ నటించిన సినిమా రూ.300 కోట్ల గ్రాస్, భారీగా రూ.100 కోట్ల లాభాలు సొంతం చేసుకుంది.
- చిరంజీవి సినిమాలో నయనతార, వెంకటేష్ ఉండటం వల్ల రెమ్యూనరేషన్స్ బడ్జెట్ పెరగడమే కారణం!
- కలెక్షన్ల పరంగా చిరు సినిమా టాప్, కానీ లాభాల్లో వెంకీ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్!
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోలు. అయితే, వీరిద్దరి సినిమాల మధ్య బాక్సాఫీస్ దగ్గర ఒక ఆసక్తికరమైన పోలిక తెరపైకి వచ్చింది. ఏ సినిమా ఎక్కువ లాభాలు సాధించిందో చూద్దాం!
చిరు సినిమా కలెక్షన్ల సునామీ
Chiru-Venky: మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పక్కా ఫ్యామ్మిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం 25 రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
అయితే, అంతకుముందు దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా కూడా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే, ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కంపేర్ చేస్తూ కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే. ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్ అంటే ఎవరైనా మన శంకర వరప్రసాద్ గారు అని టక్కున చెప్పేస్తారు.
వెంకీ సినిమా లాభాల పంట
కానీ, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమా(Chiru-Venky) కంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమానే పెద్ద హిట్ అని తెలుస్తోంది. అదెలా అంటే, మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూ.375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినప్పటికీ కేవలం రూ.44 కోట్ల ప్రాఫిట్స్ మాత్రమే సాదించిందట. కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ రూ.100 కోట్ల ప్రాఫిట్స్ సాదించిందట.
బడ్జెట్ లెక్కల్లో అసలు మతలబు
ఆ లెక్కన చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు కంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమానే పెద్ద హిట్. అయితే, కలెక్షన్స్ భారీగా వచ్చినప్పటికీ ప్రాఫిట్స్ లో అంత తేడా రావడానికి కారణం సినిమా బడ్జెట్స్ అని తెలుస్తోంది. ఎందుకంటే, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో వెంకటేష్ తప్పా పెద్దగా స్టార్స్ ఎవరు లేదు. కానీ, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉన్నారు. వీరి రెమ్యునరేషన్స్ కే చాలా వరకు బడ్జెట్ అయ్యింది అన్నట్టుగా తెలుస్తోంది. దానివల్ల ఈ రెండు సినిమాల ప్రాఫిట్స్ మధ్య ఇంత వ్యత్యాసం వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
మొత్తానికి చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. అయితే, లాభాల పరంగా వెంకటేష్ సినిమానే పైచేయి సాధించింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


