
📌 Key Points
- తమిళనాడు సీఎం విజయ్ తన కారు డ్రైవర్ కుమారుడిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు.
- శబరినాథన్ కు కేబినెట్ ర్యాంకు హోదా, మంత్రి స్థాయి అధికారాలు లభించనున్నాయి.
- TVK పార్టీ తరఫున విరుగంబాక్కం నుంచి శబరినాథన్ ఎమ్మెల్యేగా గెలిచారు.
- శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ 30 ఏళ్లుగా సీఎం విజయ్ వద్ద నమ్మకమైన డ్రైవర్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు. ఈ పదవితో శబరినాథన్‌కు కేబినెట్ ర్యాంకు హోదా, మంత్రి స్థాయి అధికారాలు లభించనున్నాయి. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియామకం చేశారు. దీంతో అతనికి కేబినెట్ ర్యాంకు హోదా దక్కనుంది. మంత్రి స్థాయి అధికారాలు, సౌకర్యాలు కూడా ఇకపై ఉంటాయి. ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ తరఫున విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శబరినాథన్ పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై 27 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు శబరినాథన్. కాగా శబరినాథన్ తండ్రి రాజేంద్రన్… దాదాపు 30 సంవత్సరాలుగా సీఎం విజయ్ దగ్గర పనిచేస్తున్నారు. నమ్మకమైన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
శబరినాథన్ రాజకీయ ప్రస్థానం
నమ్మకానికి దక్కిన గౌరవం
సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం నమ్మకానికి, విధేయతకు దక్కిన గౌరవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఒక సామాన్య డ్రైవర్ కుమారుడికి ఇంతటి కీలక పదవి దక్కడం రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


