
📌 Key Points
- బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’పై కాపీ ఆరోపణలు చేసిన కన్నడ డైరెక్టర్ ఆర్.ఎస్. సంతోష్ కుమార్.
- 2023లోనే కథను రిజిస్టర్ చేయించానని సంతోష్ కుమార్ వెల్లడి.
- టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలకు కథ వినిపించానని ఆవేదన.
- ‘ధురంధర్ 2’ సినిమాపై చట్టపరంగా పోరాడతానని హెచ్చరిక.
బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. కన్నడ దర్శకుడు ఆర్.ఎస్. సంతోష్ కుమార్ తన కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ సంచలనం సృష్టించారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.
‘ధురంధర్ 2’పై కన్నడ దర్శకుడి కాపీ ఆరోపణలు
బాలీవుడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యాధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమాకి కొనసాగింపుగా ధురంధర్: ది రివేంజ్ పేరిట మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా వరుస కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కేవలం 12 రోజుల్లోనే 1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి అందరిని అబ్బురపరిచింది. అలాంటి ఈ సినిమా స్టోరీ తనదే అంటూ ఒక కన్నడ డైరెక్టర్ కాపీ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ధురంధర్ 2 సినిమా 1000 కోట్లను ఎప్పుడో దాటేసింది. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనలు , నోట్ల రద్దు , ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా నడుస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అందులోనూ కాపీ ఆరోపణలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆర్.ఎస్. సంతోష్ కుమార్ ఈ సినిమా స్టోరీ తనదేనని, కాపీ కొట్టి ఈ సినిమా తీశారని సంచలన ఆరోపణలు చేశారు.
సంతోష్ కుమార్ ఆరోపణలు, ఆవేదన
కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. “2023 లోనే ఈ కథను రిజిస్టర్ చేయించాను. టి సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథను వినిపించాను. ఇక వీరు నా కథను ఒప్పుకుంటారని, ఖచ్చితంగా ఈ సినిమాను తెరపైకి తీసుకెళ్లి సంచలనం సృష్టించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ సడన్గా నా కథను కాపీ కొట్టి ఇప్పుడు ధురంధర్ 2 పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు . నన్ను మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ సినిమాను నేను చూడడం వల్లే అసలు విషయం తెలిసిపోయింది. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తాను అంటూ సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఒకవైపు బాలీవుడ్ లో వరుస కలెక్షన్స్ వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్న దర్శకుడు
‘ధురంధర్ 2’ చిత్రం విడుదలైన కొద్దిరోజులకే కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ వివాదం సినిమా భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.

