
📌 Key Points
- సిద్ధు జొన్నలగడ్డ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఫ్రీగా సినిమా చేస్తున్నాడని సమాచారం.
- డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు సినిమాలు పెద్దగా ఆడలేదు.
- సిద్ధు నటించిన ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి.
- సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కొంత తీసుకుంటాడని టాక్.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుస ఫ్లాపుల కారణంగానే సిద్ధు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సిద్ధు జొన్నలగడ్డ ఫ్రీగా సినిమా చేస్తున్నాడా?
Siddu Jonnalagadda Movie : నటించడం ఒక్కటే కాదు.. స్క్రీన్ రైటర్, సింగర్, లిరిక్ రైటర్ అంటూ మల్టీ టాలెంటెడ్‌గా ఉన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా అంటే… అవును అనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా నాగ వంశీ సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌లో అంట. మరి పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
జోష్ సినిమాతో సైడ్ క్యారెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ.. చిన్న చిన్న సినిమాలు చేస్తూ గుంటూరు టాకిస్ సినిమాతో హీరో అయ్యాడు. తర్వాత డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ సిద్దు అయిపోయాడు. సిద్ధు కెరీర్‌లో ఈ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు తప్పా… మిగితావేవీ పెద్దగా ఆడలేదు. రీసెంట్‌గా వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడు అని సమాచారం అందుతుంది. సిద్ధు ఇప్పుడు చేస్తున్న టిల్లు క్యూబ్ మూవీని ఫ్రీగా చేస్తున్నాడట. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. దీనికి మ్యాడ్ ఫేం కళ్యాణ్ శంకర్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
సిద్ధు కెరీర్‌కు బ్రేక్ వేసిన సినిమాలు ఏవి?
ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఒక హీరో కోట్ల రూపాయల తీసుకుంటున్న ఈ రోజుల్లో సిద్ధు ఫ్రీగా చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, సినిమా రిలీజ్ అయిన తర్వాత.. వచ్చిన కలెక్షన్స్, లాభాలను బట్టి.. ఎంతో కొంత తీసుకుంటాడని సమాచారం.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇలా ఫ్రీగా సినిమాలు చేయడానికి కారణం.. ఆయన చివరి రెండు సినిమాలే అని చెప్పొచ్చు. సిద్ధు చేసిన లాస్ట్ టూ మూవీస్… జాక్ & తెలుసు కదా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన జాక్ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఇక కలెక్షన్ల పరంగా చూస్తే 10 కోట్లు కూడా రాలేవు. ఫుల్ థియేట్రికల్ రన్ లో కేవలం 9.5 కోట్లు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. అంటే నిర్మాణ ఖర్చుల పరంగా చూస్తే దాదాపు సినిమాకు 30 కోట్ల వరకు నష్టం వచ్చింది.
నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిన సినిమాలు
దీని తర్వాత సిద్ధు చేసిన మరో సినిమా తెలుసు కదా. నీరజ కోన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 45 నుంచి 50 కోట్ల వరకు పెట్టి నిర్మించింది. కానీ, ఆ సినమాకు వచ్చిన కలెక్షన్లు 11 కోట్లు మాత్రమే. అంటే ఈ సినిమా వల్ల కూడా నిర్మాతలకు దాదాపు 30 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.
ఇలా.. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్ కావడంతో… తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధు ఫ్రగా సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది.
సిద్ధు జొన్నలగడ్డ ఫ్రీగా సినిమా చేయడం వెనుక కారణాలు ఏమైనా, తన రాబోయే సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఆశిద్దాం. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


