
📌 Key Points
- కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై నిర్మాత ధీరజ్ అసహనం వ్యక్తం చేశారు.
- ఏ సర్టిఫికెట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ రాలేకపోతున్నారని, ఇది కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని ధీరజ్ అన్నారు.
- ఈ సమస్యపై ప్రధాని మోదీని కూడా కలుస్తానని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
- ఇదే సమస్య ఈ ఏడాది దాదాపు 5 చిత్రాలకు ఎదురైందని ఆయన గుర్తు చేశారు.
సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై నిర్మాత ధీరజ్ మొగిలినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీని వల్ల కలెక్షన్లు తగ్గుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ సర్టిఫికెట్‌పై నిర్మాత ధీరజ్ ఆవేదన
Couple friendly: అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin Chandrasekhar) దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. పైగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాకు వర్షం సినిమా లాగే సంతోష శోభన్ కి ఈ సినిమా అలా నిలిచిపోతుంది అంటూ ఆయన తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా రెబల్ స్టార్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో అటు ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాకపోవడం సెన్సార్ వల్లే అంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కలెక్షన్లపై ఏ సర్టిఫికెట్ ప్రభావం
ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..” ఈరోజు శివరాత్రి పండుగ కావడంతో అటు ఫ్యామిలీలు, పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకున్నా ఈ A సర్టిఫికెట్ వల్ల వాళ్ళు థియేటర్లకు రాలేకపోతున్నారు . దీనివల్ల మా సినిమాకు ఎంత అప్రిసియేషన్ వచ్చినప్పటికీ నిర్మాతగా మాకు దక్కాల్సిన రెవెన్యూ మాత్రం దక్కడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ సినిమాకే కాకుండా ఈ ఏడాది దాదాపు 5 చిత్రాలకు ఇలాంటి యూ/ఏ సర్టిఫికెట్ సమస్యలు ఎదురయ్యాయి అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ సమస్యపై దిల్ రాజును సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సెన్సార్ నిర్ణయాలు ముంబై నుంచి వస్తున్నాయి కాబట్టి మేమేం చేయలేమని దిల్ రాజు కూడా చేతులెత్తేశారు. కానీ మా బాధను చెప్పుకోవడానికి అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరకైనా వెళ్లి మా బాధను చెప్పుకుంటాము. అప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందేమో.. ఇలాంటి సమస్యలు ఒక్క మా సినిమాకే కాదు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 చిత్రాలు ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.. అంటూ ధీరజ్ మొగిలినేని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీని కలవనున్న ధీరజ్
ఇక ప్రస్తుతం ఈ సినిమాకి A సర్టిఫికెట్ రావడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూడలేకపోతున్నారని.. తద్వారా రెవెన్యూ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు ధీరజ్. ఇదిలా ఉండగా ఇదే కాంబినేషన్ ను సెట్ చేస్తూ మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న కూడా ఇలాగే ఒక లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ఏది ఏమైనా మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అని తెలిసి అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
ఏ సర్టిఫికెట్ సమస్యను పరిష్కరించడానికి ధీరజ్ మొగిలినేని ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకోవడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


