|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ప్రధాని అవుతారా? మోడీ జాతకంతో పోల్చిన జ్యోతిష్యుడి సంచలన జోస్యం వైరల్!

Published: 15-05-2026, 5:30 PM
విజయ్ ప్రధాని అవుతారా? మోడీ జాతకంతో పోల్చిన జ్యోతిష్యుడి సంచలన జోస్యం వైరల్!
  • దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
  • జ్యోతిష్యుడు రాధన్ పండిట్ విజయ్ ప్రధాని అవుతారని సంచలన జోస్యం చెప్పారు.
  • విజయ్ జాతకం ప్రధాని మోడీ జాతకాన్ని పోలి ఉందని పండిట్ పేర్కొన్నారు.
  • రాబోయే 30-40 ఏళ్లు భారత రాజకీయాల్లో విజయ్ హవా ఉంటుందని అంచనా.

దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంపై ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ సంచలన జోస్యం చెప్పారు. విజయ్ కేవలం తమిళనాడు ముఖ్యమంత్రిగానే కాకుండా, దేశ ప్రధాని అయ్యే యోగం ఉందని, ఆయన జాతకం మోడీ జాతకాన్ని పోలి ఉందని పండిట్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ రాజకీయ ప్రవేశం: సంచలనం సృష్టించిన టీవీకే

Vijay Politics : సీయం దళపతి విజయ్ ఏకంగా పీయం సీటుకే గురిపెట్టబోతున్నాడా అంటే వినిపిస్తున్న టాక్స్ బట్టి అవుననే అనిపిస్తుంది.ఈమధ్యే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెల్సిందే.అయితే విజయ్ తమిళ నాడుకి సీయం గానే కాదు దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడని ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి.

30 నుండి 40 ఏళ్ళు భారత రాజకీయాల్లో విజయ్ హవా

రాధన్ పండిట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ జాతకం అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతకాన్ని పోలి ఉందని, ఆయనకు దేశ ప్రధాని అయ్యే యోగం పుష్కలంగా ఉందని ఆయన జోస్యం చెప్పారు.రాధన్ పండిట్ విశ్లేషణ ప్రకారం.. ”మోదీ జాతకంలో ఉన్న గ్రహస్థితులు, బలమైన ప్రజాకర్షణ శక్తులు విజయ్ జాతకంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. మోదీ జాతకానికి విజయ్ జాతకం ఒక జిరాక్స్ కాపీ లాంటిది. రాబోయే 30 నుండి 40 ఏళ్ల పాటు భారత రాజకీయాల్లో విజయ్ శకం నడుస్తుంది. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు దేశ గమనాన్ని మారుస్తాయి” అని ఆయన పేర్కొనడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో  చెప్పిన విషయాలు చూస్తుంటే, విజయ్ కేవలం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్దే కాదు, ఢిల్లీ పీఠం వద్ద కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.

cm కావడం వెనుక మోదీ లాంటి స్ట్రాటజీ

మోడీ జాతకంతో విజయ్ పోలికలు: జ్యోతిష్యుడి విశ్లేషణ

సినిమా రంగంలో 1992లో ‘నాళైయ తీర్పు’తో ప్రస్థానం మొదలుపెట్టి, ‘పూవే ఉనక్కాగా’, ‘కాదలుక్కు మరియాదై’, ‘గిల్లి’, ‘పోక్కిరి’ వంటి బ్లాక్ బస్టర్లతో మాస్ హీరోగా ఎదిగిన విజయ్, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ముఖ్యంగా 2023లో విడుదలైన ‘లియో’ మరియు 2024లో వచ్చిన ‘ది గోట్’ (The GOAT) చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు బాయ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 2024 ఫిబ్రవరి 2న తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, అతి తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక మోదీ లాంటి స్ట్రాటజీ ఉందన్నది కొందరి వాదన.

ఇక రాధన్ పండిట్ అంచనా ప్రకారం, విజయ్ పాటించే సింప్లిసిటీ మరియు క్లిష్ట సమయాల్లో ఆయన చూపే ధైర్యం మోదీని గుర్తుచేస్తాయని. గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఎలాగైతే దేశ ప్రధానిగా ఎదిగారో, విజయ్ కూడా తమిళనాడు సీఎంగా తనదైన ముద్ర వేసి జాతీయ స్థాయికి వెళ్తారని ఆయన బల్లగుద్ది చెబుతుండటం విశేషం.ఇక ఈ వార్త ఇలా బయటికి వచ్చిందో లేదో నెట్టింట్లో “ఫ్యూచర్ పీఎం విజయ్” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.ఇక దళపతి అభిమానులు అయితే కేవలం తమిళనాడుకే కాదు, దేశానికి నాయకత్వం వహించే శక్తి ఆయనకు ఉందని పోస్టులు పెడుతూ రచ్చ మొదలెట్టేశారు కూడా.

ఢిల్లీ పీఠంపై విజయ్ కన్ను: ప్రధాని యోగం ఉందా?

కింగ్ మేకర్ అవుతారా లేక కింగ్ అవుతారా

ఇక రాజకీయ విశ్లేషకులు సైతం విజయ్ సోషల్ ఇంజనీరింగ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో ఆయన డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో, ఇప్పుడు సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉంటున్నాయి. మరి రాధన్ పండిట్ చెప్పినట్లుగా 2029 లేదా ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి విజయ్ దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారా లేక ఏకంగా కింగ్ అవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

విజయ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుడి అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో కాలమే నిర్ణయించాలి. అయితే, ఈ జోస్యం మాత్రం అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విజయ్ తదుపరి అడుగులు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.