
📌 Key Points
- శివాజీ, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో ‘దండోరా’ చిత్రం తెరకెక్కింది.
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
- నిర్మాత బెన్నీ అభిరుచిని, ‘దండోరా’ కంటెంట్‌ను అనిల్ రావిపూడి కొనియాడారు.
- చిత్రానికి స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్ అని నిర్మాత రవీంద్ర బెనర్జీ వెల్లడించారు.
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావాలని అనిల్ ఆకాంక్షించారు. ‘దండోరా’తో నిర్మాతకు భారీ విజయం దక్కాలని ఆయన అన్నారు.
అనిల్ రావిపూడి ఆశీస్సులు: ‘దండోరా’ విజయంపై నమ్మకం
శివాజీ(Shivaji), నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దండోరా’(Dhandoraa). మురళీకాంత్ (Muralikanth)దర్శకత్వం వహించగా.. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌గా వచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘దండోరా’ నిర్మాత బెన్నీ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ టేస్ట్ ఉన్న చిత్రాల్నే నిర్మిస్తుంటారు.
మళ్లీ డిసెంబర్ 25న ఈ ‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి. ఈమూవీ టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది’’ అన్నారు. అలాగే నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మాట్లాడుతూ .. ‘మురళీ నాకు మూడేళ్ల క్రితం స్టోరీ చెప్పాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ‘దండోరా’ లాంటి చిత్రాన్ని సపోర్ట్ చేయాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సపోర్ట్ ఎంతో అవసరం. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీకి స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్. మిగతాది సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’ అని చెప్పారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని అనుభవాలు
‘దండోరా’ విడుదల తేదీ, నటీనటుల వివరాలు
‘దండోరా’ చిత్రంపై అనిల్ రావిపూడి ప్రశంసలు, నిర్మాత నమ్మకం సినిమా విజయంపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.


