
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె స్పిరిట్ సినిమా తర్వాత కల్కి 2 నుంచి కూడా తప్పుకుంది. నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఖాళీని భర్తీ చేయడానికి కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపిస్తున్నాయి.
Key Points
స్పిరిట్ సినిమా తర్వాత దీపికా పదుకొణె కల్కి 2 నుంచి బయటకు వెళ్ళింది.
వైజయంతీ మూవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
దీపికాకు బదులుగా కీర్తి సురేష్ లేదా కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సీక్వెల్ కోసం మరింత కమిట్‌మెంట్ ఉన్న నటి అవసరం అని నిర్మాతలు పేర్కొన్నారు.
దీపికా పదుకొణె కల్కి 2 నుంచి బయటకు
ఇటీవల మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్‌గా దీపికా పదుకొణెను తొలగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం, ఆ తర్వాత దీపికా పదుకొణె కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.
అయితే, తాజాగా ప్రభాస్‌తో తెరకెక్కనున్న మరో సినిమా కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొణె అవుట్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898 ఏడీ సీక్వెల్ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించట్లేదని మేకర్స్ తెలిపారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపికా భాగం కాదని ప్రొడక్షన్ హౌజ్ వైజయంతీ మూవీస్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది.
నిర్మాతల అధికారిక ప్రకటన
ట్విటర్‌లో “రాబోయే కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. అన్ని మార్గాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ మూవీతో చాలా కాలం ప్రయాణించిన దీపికా పదుకొణె కంటే మంచి భాగస్వామ్యం దొరకరు. కానీ, కల్కి లాంటి సినిమా అంతకుమించి కమిట్‌మెంట్ కోరుకుంటుంది. ఆమె భవిష్యత్‌కు బెస్ట్ విషెస్ అందిస్తున్నాం” అని రాసుకొచ్చారు.
ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, దీపికకు బదులు వేరే హీరోయిన్స్‌ను తీసుకోమ్మని సలహా ఇస్తున్నారు నెటిజన్స్. “సుమతి (కల్కిలో దీపికా పాత్ర పేరు)గా కీర్తి సురేష్ ను ఎందుకు తీసుకోకూడదు. ఆమెకు మంచి టాలెంట్ ఉంది. అలాగే, పాత్రకు సరిగ్గా సరిపోతుంది” అంటూ నాగ్ అశ్విన్‌కు ట్యాగ్ చేస్తున్నారు.
నెటిజన్ల సూచనలు: కీర్తి సురేష్, కల్యాణి
మరొకరు ఇటీవల సూపర్ వుమెన్ లోకాతో హిట్ కొట్టిన కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకోమ్మని కోరుతున్నారు. “ఈ ఫ్రాంచైజీలో ఆమె ఇక భాగం కానందుకు సంతోషిస్తున్నాం. ఆమె నటించిన సీన్లలో ఏమాత్రం ఎమోషనల్ లేదు. ఆమె ఉన్న కొన్ని క్షణాల సీన్లలో మృణాల్ ఠాకూర్ ను తీసుకోవడం చాలా బెటర్” అని మరొకరు రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే, స్పిరిట్ మూవీలో దీపికా పదుకొణెకు బదులు త్రిప్తి డిమ్రి ని తీసుకున్న విషం తెలిసిందే. కాగా, దీపికా పదుకొణె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
దీపికా పదుకొణె కల్కి 2 నుంచి వైదొలగడంతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. కీర్తి సురేష్ లేదా కల్యాణి ప్రియదర్శన్ లలో ఎవరు ఈ పాత్రలో నటించబోతున్నారో చూడాలి.


