
📌 Key Points
- రణవీర్ సింగ్ ‘దురంధర్ 2’ మూవీకి దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్!
- భారీ కలెక్షన్లతో థియేటర్లలో దుమ్ము రేపుతున్న ‘దురంధర్ 2’ సినిమా.
- అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ప్రశంసలు!
- భర్త సక్సెస్‌పై దీపికా స్పందించకపోవడంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్!
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ చిత్రం భారీ విజయం సాధించింది. అయితే, దీపికా పదుకోన్ భర్త సక్సెస్‌పై స్పందించకపోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి!
దురంధర్ 2 సక్సెస్‌తో రణవీర్ కెరీర్ పీక్స్‌లో!
Deepika Padukone : రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ 2 సినిమా దూసుకుపోతుంది. దేశమంతటా ఫుల్ పాజిటివ్ టాక్ తో, భారీ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది. ధురంధర్ పార్ట్ 1 కి మించి పార్ట్ 2 హిట్ అయ్యేలా ఉంది. సినిమాలోని ట్విస్ట్ లు, యాక్షన్ సీన్స్, స్పై సీన్స్ ప్రేక్షకులని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.
టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సాధారణ ప్రేక్షకులతో పాటు స్టార్ హీరోలు, నటీనటులు సైతం ధురంధర్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. మన అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా స్టార్స్ అంతా దురంధర్ సినిమాని అభినందిస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. దేశంలోని స్టార్స్, ప్రేక్షకులు అంతా పొగుడుతున్నా రణవీర్ సింగ్ భార్య, హీరోయిన్ దీపికా పదుకోన్ మాత్రం సైలెన్స్ గా ఉంది.
దీపికా మౌనం.. బాలీవుడ్‌లో రకరకాల ఊహాగానాలు!
దీపికా ఇప్పటివరకు రిలీజ్ కి ముందు కానీ, రిలీజ్ తర్వాత కానీ దురంధర్ గురించి ఒక్క పోస్ట్ పెట్టడం కానీ, ఎక్కడా మాట్లాడటం కానీ చేయలేదు. పక్క పరిశ్రమలో స్టార్ హీరోలు మెచ్చుకుంటున్నా భర్త సినిమాపై భార్య కనీసం అభినందిస్తూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదేంటి అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ అయితే ఈ విషయాన్నీ వైరల్ చేస్తుంది.
రణ్‌వీర్, దీపికాల మధ్య విభేదాలున్నాయా?
దీపికా ఏమైంది? దీపికా రణవీర్ సినిమా సక్సెస్ పై ఎందుకు స్పందించలేదు, వీరిద్దరి మధ్య ఏమైనా జరిగిందా? ఒక్క పోస్ట్ కూడా పెట్టలేనంతగా దీపికా బిజీగా ఉందా అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో రణవీర్ మాములు ఫిలిం ఫేర్ అవార్డు సాధిస్తేనే పోస్ట్ పెట్టిన దీపికా ఇప్పుడు దురంధర్ పార్ట్ 1కి ఒక స్టోరీ పెట్టి వదిలేసింది. ఇప్పుడు పార్ట్ 2 పెద్ద సక్సెస్ అవుతున్నా అది కూడా లేదు. దీంతో దీపికా మౌనం బాలీవుడ్ లో చర్చగా మారింది.
దీపికా పదుకోన్ ఎందుకు స్పందించలేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


