
📌 Key Points
- నటి చైత్ర రాయ్ తన తొమ్మిదో పెళ్లిరోజున రెండో బిడ్డకు జన్మనిచ్చింది.
- ఇదివరకే ఒక పాప ఉండగా, ఇప్పుడు మళ్ళీ ఆడబిడ్డ పుట్టినట్లు ప్రకటించింది.
- తమ జీవితాల్లో అద్భుతం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపింది.
- చైత్ర రాయ్ ‘దేవర’ సినిమాలో కూడా నటించగా, అష్టాచమ్మా సీరియల్‌తో ఫేమస్.
బుల్లితెర నటి చైత్ర రాయ్ అభిమానులకు అద్భుతమైన శుభవార్త అందించింది. తన తొమ్మిదో పెళ్లిరోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఒక పాప ఉండగా, రెండోసారి తల్లిగా మారినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. తమ కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టిందని ఆనందం వ్యక్తం చేసింది.
చైత్ర రాయ్‌కి డబుల్ గుడ్‌న్యూస్
బుల్లితెర నటి చైత్రరాయ్(Chaitra Rai) అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్‌లు చెప్పింది. తొమ్మిదో పెళ్లి రోజు నాడే తమకు పండంటి బిడ్డ పుట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఇది వరకే ఓ పాప ఉండగా.. ఇప్పుడు మరోసారి కూతురు పుట్టినట్లు తెలిపింది. తమ కుటుంబంలో మరో మెంబర్ జాయిన్ అయినట్లు నలుగురి చేతుల ఫొటోను షేర్ చేసింది. ‘‘మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది.
పెళ్లిరోజున అద్భుతం
మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా. మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని రాసుకొచ్చింది. కాగా.. చైత్ర రాయ్..అష్టాచమ్మా సీరియల్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అత్తో అత్తమ్మ కూతురో వంటి సీరియల్స్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలోనూ యాక్ట్ చేసింది. సీరియల్స్, ఈవెంట్స్ అంటూ కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. ప్రసన్న శెట్టి(Prasanna Shetty)ని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు పుట్టగా.. ఇప్పుడు మరోసారి ఆడబిడ్డ పుట్టింది.
చైత్ర రాయ్ కెరీర్ విశేషాలు
A post shared by Chaithra Rai (@chaithrarai17)
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న చైత్ర రాయ్, ఇప్పుడు రెండు ఆడపిల్లలతో పరిపూర్ణమైన కుటుంబాన్ని కలిగి ఉంది. నటిగా, తల్లిగా ఆమె ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఈ శుభవార్తతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


