
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. రియాలిటీ షోలో భాగంగా ఆమె విడాకుల విషయంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
Key Points
ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, రియాలిటీ షోలో పాల్గొంటూ విడాకులపై మాట్లాడారు.
విడాకుల తర్వాత తనపై వచ్చిన నెగెటివ్ ప్రచారంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
ఈ నెగెటివ్ ప్రచారం తన నోరు మూయించేందుకు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆమె తన జీవితంలోని ఈ అధ్యాయం ముగిసిందని, చాహల్ గాసిప్స్‌తో తనకు సంబంధం లేదని తెలిపారు.
రియాలిటీ షోలో ధనశ్రీ వర్మ వెల్లడి
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ను పెళ్లాడారు . 2020 లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు . ఫిబ్రవరి అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు . అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్ వశ్ తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి . చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి .
నెగెటివ్ ప్రచారంపై ఆమె ఆరోపణలు
అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు . ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు . చాహల్ ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి . తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది . ఇదంతా నెగెటివ్ పీఆర్ లో భాగంగానే చేశారని విమర్శించింది . ఓ ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్ ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు .
చాహల్ తో విడాకులపై ఆమె స్పందన
దీనిపై ధనశ్రీ స్పందిస్తూ .. ‘ అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు . నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే .. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది . ఆర్జే మహ్ వశ్ తో రిలేషన్ పై ధనశ్రీ మాట్లాడింది . నాకు చాహల్ తో విడాకులు అయిపోయాయి . అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు . నా లైఫ్ లో అదొక ముగిసిన అధ్యాయం . పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి . ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి . మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్ గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు . మీ టైమ్ వేస్ట్ తప్ప ‘ అని పంచుకుంది .
ధనశ్రీ వర్మ తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. తన జీవితంలోని గత అధ్యాయం ముగిసిందని, ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని తెలిపింది.


