|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సైన్ చేశారు.. రష్మిక మందన్నా గురించి అందరికి తెలుసు.. కుబేర మూవీ నిర్మాతల కామెంట్స్

Published: 13-06-2025, 3:43 AM
20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సైన్ చేశారు.. రష్మిక మందన్నా గురించి అందరికి తెలుసు.. కుబేర మూవీ నిర్మాతల కామెంట్స్

తమిళ స్టార్ ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదలవుతోంది. 20 నిమిషాల కథ విని ధనుష్ సినిమాకు సైన్ చేశాడని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

Key Points

1

20 నిమిషాల కథ విని ధనుష్ వెంటనే సినిమాకు సైన్ చేశాడు.

2

కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారు.

4

సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

ధనుష్ యొక్క తక్షణ నిర్ణయం

తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించిన సినిమా కుబేర. హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

కుబేర: స్టార్ కాస్ట్ మరియు ప్రమోషన్లు

పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌ లో ఉన్నాయి. ఇక కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

-శేఖర్ కమ్ముల గారు ‘ లవ్ స్టోరీ ‘ తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశాము.

జూన్ 20న గ్రాండ్ రిలీజ్

– ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

-కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.

కుబేర సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని నిర్మాతలు తెలిపారు. అద్భుతమైన తారాగణం మరియు ప్రమోషన్లతో ఈ సినిమా పాన్ ఇండియా సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.