|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhanya Balakrishnan: అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ అయ్యేదాన్ని.. ఇక్కడ అవి తప్పదు.. కానీ, నాకు నేను ఇలా..

Published: 27-10-2025, 10:00 AM
Dhanya Balakrishnan: అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ అయ్యేదాన్ని.. ఇక్కడ అవి తప్పదు.. కానీ, నాకు నేను ఇలా..

“కృష్ణలీల” మూవీ హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ తన కెరీర్, రొమాంటిక్ సీన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పదంటూనే, తాను వాటికి దూరంగా ఉండటం వల్ల స్టార్ కాలేకపోయానని, అయితే ప్రస్తుత స్థితి పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది.

Key Points

1

ధన్య బాలకృష్ణన్ లేటెస్ట్ మూవీ "కృష్ణలీల" త్వరలో విడుదల కానుంది.

2

ఇండస్ట్రీలో రొమాంటిక్ సీన్స్ తప్పనిసరి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

4

స్టార్ స్టేటస్ కంటే మంచి సినిమాలు, ప్రస్తుత స్థాయిపై సంతోషంగా ఉందని చెప్పింది.

కృష్ణలీల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ధన్య

Dhanya Balakrishnan: కర్ణాటక బ్యూటీ ధన్య బాలకృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవడానికి కన్నడ అమ్మాయే అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కృష్ణలీల”.(Dhanya Balakrishnan) యంగ్ హీరో దేవన్ నటిస్తూ, డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Kantara: Chapter 1 OTT: ఓటీటీకి వచ్చేస్తున్న కాంతార: చాఫ్టర్ 1.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

స్టార్ స్టేటస్ పై ధన్య బాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో ఉండాలంటే రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పనిసరి అని సంచలన కామెంట్స్ చేసింది. ఇంకా ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ” కృష్ణలీల సినిమా అనేది నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమాపై మేము చాలా నమ్మకంగా ఉన్నాము. నిజానికి, సినిమాల విషయంలో నాకు నేను చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అందుకే స్టార్ ని కాలేకపోయాను. ఇంటిమేట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేయొద్దని ముందే ఫిక్స్ అయ్యాను. అలా పెద్ద పెద్ద సినిమాను చాలా వదులుకున్నాను. అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ స్టేటస్ ను అనుభవించేదాన్ని.

రొమాంటిక్ సీన్స్, కెరీర్ పై ధన్య అభిప్రాయం

కానీ, నేను ఇప్పుడున్న పొజీషన్లోనే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే, నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది, ఈ స్థాయి వరకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు. అదే, నాకు గొప్ప ఫీలింగ్ ను అందిస్తుంది. అలాంటి పెద్ద సినిమాలు చేయడం కంటే, మంచి సినిమాలు చేయడానికే ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణన్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ధన్య బాలకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. స్టార్ స్టేటస్ కంటే తన విలువలను ఎంచుకున్న ఆమె నిర్ణయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.