
📌 Key Points
- ‘ధురంధర్’ సినిమాలో తమ ప్రాంతాన్ని చూపించినందుకు ల్యారీ ప్రజలు వాటా డిమాండ్ చేస్తున్నారు.
- సినిమా కలెక్షన్లలో 500 కోట్లు ల్యారీ అభివృద్ధికి ఇవ్వాలని వారు కోరుతున్నారు.
- ల్యారీ ప్రజల డిమాండ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
- సినిమాలో ఉగ్రవాదులను ఎదుర్కొన్న రణ్‌వీర్, ఈ డిమాండ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘దురంధర్: ది రివెంజ్’ సినిమాపై వివాదం రాజుకుంది. సినిమాలో తమ ప్రాంతాన్ని ఉగ్రవాదుల అడ్డాగా చూపించారని, వచ్చిన కలెక్షన్లలో తమకు వాటా ఇవ్వాలని ల్యారీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సినిమాలో ల్యారీని చూపించినందుకు నిరసన
Dhurandhar Controversy: ‘ధురంధర్: ది రివెంజ్’..ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి స్ప్రుష్టిస్తున్న సంగతి తెల్సిందే. అయితే, ఈ సినిమాలో చూపించిన ‘ఆపరేషన్ ధురంధర్’ కంటే పెద్ద ట్విస్ట్ ఒకటి రివీల్ అయ్యింది. అవును ధురంధర్: ది రివెంజ్’లో రణ్ వీర్ సింగ్ కరాచీలోని ల్యారీ గల్లీల్లో దూరి ఉగ్రవాదులని మత్తు బెడితే ఇప్పుడు అదే ల్యారీ ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా ధురంధర్ యూనిట్ కి పెద్ద షాకే ఇచ్చారు.
ల్యారీ ప్రజలు మాట్లాడుతూ మీ సినిమాలో మా ల్యారీ సిటీని ఉగ్రవాదులకి అడ్డాగా, యాక్షన్ సీక్వెన్స్ లకి బ్యాక్‌డ్రాప్‌గా వాడుకుని వేల కోట్లు సంపాదించారు కదా..ఇపుడు వచ్చిన ఆ వేల కోట్ల కలెక్షన్స్ లో మాకూ వాటా ఉండాలి” అంటూ డిమాండ్ చేయడం విశేషం.ఇపుడు దీనికి సంబంధించిన వీడియోలే ఎక్స్ ( X), ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ల్యారీ పేరును మీ సినిమాలో బ్రాండ్‌లా వాడుకున్నారని, అందువల్లే సినిమా సూపర్ హిట్ అయిందని సో .. సినిమా సాధించిన కలెక్షన్స్ లో ఓ 500 కోట్లు ల్యారీ డెవలప్ చేయడానికి, ఇక్కడ రోడ్లకి , ప్రజా సంక్షేమానికి ఇవ్వాలని కోరడం విడ్డూరం.సినిమాలో రణ్‌వీర్ సింగ్ గన్ పట్టుకుని ల్యారీలో వీరవిహారం చేస్తే మన జనం ఈలలు వేస్తే రియల్ లైఫ్ ల్యారీ వాసులు ఇలా ‘ క్యాలిక్యులేటర్’ పట్టుకుని వాటాలు తేల్చే పనిలో పడ్డారన్న మాట.ఏది ఏమైనా వారి తీరు చూస్తుంటే “మా గల్లీలను ఇంత డీటైల్డ్ గా చూపించినందుకు థాంక్స్ చెప్పక్కర్లేదు..కాని మీరు డబ్బులు సంపాదించిన వాటిలో కొన్ని కోట్లు ట్రాన్స్ ఫర్ చేస్తే చాలు” అన్నట్టుగా ఉంది .
500 కోట్లు ఇవ్వాలంటున్న ల్యారీ వాసులు
దీంతో ల్యారీ ప్రజలు అలా డిమాండ్ పెట్టారో లేదో సెటైర్స్ చెడుగుడు ఆడేస్తున్నారు మీమర్స్.ఒకవెళ “రేపు పొద్దున ఏలియన్ సినిమాలు తీస్తే.. మార్స్ గ్రహం నుంచి కూడా టాక్స్ అడుగుతారేమో!” అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి సినిమాలో ఉగ్రవాదులని ఎదుర్కున్న రణ్‌వీర్ , ఈ వాటా కావాలనే డిమాండ్‌ను ఎలా ఎదుర్కొంటాడో ..సాలిడ్ ఎంటర్ టైనర్ ఇచ్చిన మేకర్స్ వచ్చిన వసూళ్ల నుంచి ఏమైనా ‘ ప్రసాదం ’ పంచుతారో !
“Aditya Dhar ji, attention please…” 🤣🤣
నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్
Dhurandhar 2 has earned over ₹1000 crore so far. Now, people of LYARI are demanding a 50% share for their development. 🤣
Pakistan govt is not developing Lyari despite getting billions in loans from US and IMF. pic.twitter.com/gVaHP3R39W
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 27, 2026
మొత్తానికి దురంధర్ సినిమాపై ల్యారీ ప్రజల డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఒకవేళ స్పందించకపోతే ల్యారీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

