
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ తెలుగు వెర్షన్ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంతో రద్దు చేయబడింది.
- డిస్ట్రిబ్యూటర్లు హిందీ వెర్షన్ కే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
- ‘ధురందర్ 2’ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, 70-80% పూర్తయింది.
- ‘ధురందర్ 2’ 2026 మార్చి 19న హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ తెలుగు రిలీజ్ డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంతో రద్దయింది. హిందీ వెర్షన్ కు వస్తున్న అద్భుత రెస్పాన్స్ తో వారు వెనక్కి తగ్గారు. అయితే, ‘ధురందర్ 2’ మాత్రం తెలుగులోనూ 2026 మార్చి 19న విడుదల కానుంది.
ధురందర్ తెలుగు రిలీజ్ రద్దు ఎందుకు?
Dhurandhar 2 Telugu Release: బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ . హిందీ సినిమా అయినా దక్షిణాదిలోనూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ . ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేస్తుంది. డిసెంబర్ 5 న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది . మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్ చేశారు . కానీ , అది కుదరలేదు . డిసెంబర్ 19 న రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు . డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు .
ధురందర్ హిందీలోనే ఎక్కువ రెస్పాన్స్ అందుకుంటుందని , హైదరాబాద్ , తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు ఈ సినిమాని హిందీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు . దీంతో ధురందర్ తెలుగు వెర్షన్ రిలీజ్ నిర్ణయాన్ని మూవీ టీం పూర్తిగా వెనక్కి తీసుకుందట . దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ఇక ఉండకపోవచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి . నిర్మాతలు కూడా అదే నిర్ణయించుకున్నారట . ఇక ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుందట . ఇప్పటికే సీక్వెల్ 70 నుంచి 80 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది . వచ్చే ఏడాది ధరంధర్ 2 రిలీజ్ ఉండోచ్చని తెలుస్తోంది . ఈ సారి హిందీతో పాటు తెలుగు వెర్షన్ ఒకే రోజు రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట .
ధురందర్ 2: సీక్వెల్ ప్లాన్, రిలీజ్ డేట్
ధురందర్ 2 ని 2026 మార్చి 19 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు . అదే రోజు ఈ సీక్వెల్ తెలుగు రిలీజ్ కూడా ఉంటుందని బి – టౌన్ లో గట్టి టాక్ వినిపిస్తోంది . ప్రస్తుతం ధురందర్ మూవీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది . పేరుకే హిందీ సినిమా కానీ , దక్షిణాదిలోనూ ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది . పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పటికే షారుక్ , సల్మాన్ , ఆమీర్ , విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోల చిత్రాలు తెలుగు డబ్ అయ్యాయి .
పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ సినిమాలు
అయితే వాటిని హిందీ రిలీజ్ తో పాటు విడుదల చేసి ఉంటే మంచి వసూళ్లు వచ్చేవి . కానీ , హిందీ రిలీజ్ తర్వాత కాస్తా ఆలస్యంగా తెలుగులో విడుదలయ్యాయి . దీంతో ఇక్కడ ఆడియన్స్ సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గి పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి . అయితే ఇదే తప్పు ధురందర్ విషయంలోనూ జరిగింది . నిజానికి ఈ సినిమాకు నార్త్ లోనే కాదు దక్షిణాదిలో మంచి బజ్ వస్తుంది . అప్పుడే తెలుగు వెర్షన్ రిలీజ్ చేసి ఉంటే మేకర్స్ కి మరిన్ని లాభాలు వచ్చేవి . కనీసం చెప్పిన టైంలో అయిన విడుదల అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది . ఇప్పుడు సినిమా విడుదలైన రెండు వారాలు దాటిపోయింది . మూవీ వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పటికే హైదరాబాద్ ఆడియన్స్ హిందీలో ఈ చిత్రాని చూశారు . కాబట్టి ఈ టైంలో తెలుగు వెర్షన్ తీసుకురావడం రిస్క్ అవుతుంది . అందుకే ధురందర్ ఫస్ట్ పార్ట్ ఇక తెలుగులో ఆపేశారని సమాచారం .
‘ధురందర్’ తెలుగు రిలీజ్ రద్దైనా, ‘ధురందర్ 2’ మాత్రం తెలుగులో 2026లో రావడం శుభవార్త. ఈ నిర్ణయం తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో ఇది ఒక మంచి ముందడుగు.


