📌 Key Points
- దురంధర్ చిత్రం 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
- రణవీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు.
- అవతార్ 3 విడుదలైనప్పటికీ దురంధర్ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు.
- 280 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
రణవీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. అవతార్ 3 విడుదలైనప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు 800 కోట్లకు పైగా రాబట్టి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ విజయంపై ఓ లుక్కేద్దాం.
రణవీర్ సింగ్ దురంధర్: బాక్సాఫీస్ సంచలనం
Dhurandhar Collections : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం దురంధర్.. ఆదిత్య ధార్ దర్శకత్వంలో స్పై, యాక్షన్ మూవీగా తెరకెక్కింది. దురంధర్ చిత్రాన్ని జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు కలిసి నిర్మించారు. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్ వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి షో కి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 16 రోజులు అవుతున్న ఈ మూవీ కలెక్షన్స్ జోరు తగ్గట్లేదు.. దాదాపుగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.. ఒకవైపు థియేటర్లలోకి అవతార్ మూవీ వచ్చినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ తగ్గట్లేదు. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఆకట్టుకున్న హాలీవుడ్ మూవీ అవతార్.. ఇప్పటికే వచ్చిన రెండు పార్ట్ లు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా అవతార్ 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చిన తర్వాత దురంధర్ స్పీడ్ తగ్గుతుందేమోనని ట్రేడ్ వర్గాలు అనుమానించాయి. కానీ ఆ సూచనలు లేవు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈసారి పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదని రివ్యూలు చూస్తే అర్థమవుతుంది.. ఈ వీకెండ్ వరకు బాగానే ఉన్నా తర్వాత నెమ్మదించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు అర్థమైపోయింది.. దురంధర్ సినిమా షోలు పెరుగుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ జనాలు రణవీర్ సింగ్ మూవీకి నిరాజనం పలుకుతున్నారు..
అవతార్ 3 ధాటిని తట్టుకున్న దురంధర్
సినిమాకు భారీ బడ్జెట్, కలెక్షన్ల వర్షం
ఈ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. విడుదల అయిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చెయ్యాలి.. కానీ ఇప్పుడు డబల్ వసూళ్లను రాబట్టింది.. ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు పరుగులు పెడుతుంది. ఈ వీకెండ్ లోపలే రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇదే జోరులో ఈ నెల కొనసాగితే మాత్రం మూవీ 2000 కోట్లు రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా రణవీర్ సింగ్ సినిమాకు ఎన్ని కోట్ల వసూలు రావడం ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…
మొత్తానికి, దురంధర్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పెద్ద బడ్జెట్ హాలీవుడ్ చిత్రమైన అవతార్ 3 పోటీ ఉన్నా, దురంధర్ విజయం రణవీర్ సింగ్‌కు పెద్ద బూస్ట్‌ను ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది.


