
📌 Key Points
- మంచు విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌తో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందుతున్నారు.
- దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌పై కొత్త దర్శకులకు అవకాశమిస్తూ తక్కువ బడ్జెట్‌లో కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
- దిల్ రాజు ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు, చిన్న సినిమాలతో మంచి లాభాలు పొందుతున్నారు.
- దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌కు 330 స్క్రిప్టులు రాగా, వాటిలో కొన్నింటిని ఎంపిక చేసి త్వరలో సినిమాలు తీయనున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇద్దరూ ప్రస్తుతం ఒకే విధమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు.
మంచు విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విశేషాలు
Dil Raju and Manchu Vishnu: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఇద్దరి మైండ్ సెట్స్ ఒకేలా ఆలోచిస్తున్నాయా? లేదంటే ఇద్దరికీ సలహాలు ఇచ్చే వ్యక్తి ఒక్కరేనా? అని అనిపిస్తుంది వారిద్దరి ప్లానింగ్ చూస్తుంటే. అవును రీసెంట్‌గా మంచు విష్ణు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ (AVAA International Short Film Contest) పెట్టిన విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్‌లో ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ప్లే చేసి, వాటిలో దేనిని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారో, ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌ని విజేతగా ప్రకటిస్తానని, వారికి రూ. 10 కోట్లతో ఫీచర్ ఫిల్మ్ అవకాశం ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు వేలాది మంది స్పందించారు. దాదాపు 100 షార్ట్ ఫిల్మ్స్‌ని ఫైనల్ చేసినట్లుగా కూడా ప్రకటించారు. ఆ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో ఎప్పటికీ ఉంటాయి. వాటి ద్వారా విష్ణుకి మనీ వస్తూనే ఉంటుంది. ఇలా సీజన్ల వారికి మంచు విష్ణు ఈ కాంటెస్ట్‌ను ముందుకు తీసుకెళుతూనే ఉంటారు. కాబట్టి.. కాలు మీద కాలేసుకుని సంపాదించే ప్లాన్ ఇది.
దిల్ రాజు డ్రీమ్స్: కొత్త టాలెంట్‌కు అవకాశం
ఇక దిల్ రాజు విషయానికి వస్తే.. ప్రస్తుతం దిల్ రాజు సినిమాలు సక్సెస్, జడ్జిమెంట్ విషయంలో కాస్త ట్రాక్ తప్పారు. ఒక పెద్ద సినిమా ఆడకపోతే ఆయనకు కోట్లలో నష్టం వస్తుంది. అదే ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే.. కోట్లలో రాబడుతుంది. ఒక 10, 15 కోట్లలో మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే.. అవి కూడా ఈ మధ్య 100 కోట్ల వరకు రాబడుతున్నాయి. అలా ఇప్పుడాయన దిల్ రాజు డ్రీమ్స్ (Dil Raju Dreams) అనే బ్యానర్‌ను స్థాపించి, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. మంచి కథ రెడీ చేసుకుని వెళితే, ఆయన విని, తన అనుభవంతో, ఆ సినిమాను చిత్రీకరణకు కావాల్సిన అన్నీ సమకూర్చుతారు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి.. ఇక ఆ సినిమాలకు తిరుగుండదు. అలా ఈ బ్యానర్ ప్రకటించిన తర్వాత దాదాపు 330 స్ర్కిప్ట్స్ వచ్చాయని స్వయంగా ఆయనే తాజాగా జరిగిన ‘మార్కండేయ’ వేడుకలో చెప్పారు. ఆ 330లో నుంచి కేవలం 100 స్ర్కిప్ట్స్ మాత్రమే తన టీమ్ చదవగలిగిందని, అందులో నుంచి ఓ ఐదారు సినిమాలు తన నూతన బ్యానర్ నుంచి ఈ ఏడాది వస్తాయని దిల్ రాజు ప్రకటించారు.
చిన్న సినిమాలతో దిల్ రాజు సక్సెస్ ఫార్ములా
అందులో భాగంగానే తన బ్యానర్ నుంచి ‘మార్కండేయ’ అనే సినిమా మొదటి సినిమాగా రాబోతుందని చెప్పారు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ చూస్తే.. వావ్ అనేలానే ఉంది. అతి తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తీసి దిల్ రాజు హిట్ కొట్టబోతున్నారనే కళ ఈ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించింది. అలా, ఎప్పుడూ తన బ్యానర్‌లో సినిమా కథలకు లోటు లేకుండా దిల్ రాజు ప్లాన్ చేశారు. చూస్తుంటే.. మంచు విష్ణు, దిల్ రాజుల ప్లాన్.. మాములు ప్లాన్ కాదని, భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద స్కెచ్చే వేశారనేది అర్థమవుతోంది. ఒక చిన్న సినిమా, అందులోనూ దిల్ రాజు చేతుల్లో పోవడమనేది ఉండదు. ఆ సినిమా బడ్జెట్‌ను ఏదో ఒక రూపంలో దిల్ రాజు రాబట్టగలరు. ఎస్వీసీలో స్టార్ హీరోలతో ఏడాదికి ఒక సినిమా చేస్తే, ఇక్కడ 5 సినిమాలు చేయవచ్చనేది దిల్ రాజు ప్లాన్. ఏమైనా దిల్ రాజు బుర్రే బుర్ర. మరి ఇది ఆయన బుర్రా? లేదంటే ఎవరైనా పక్కన బుర్రతో తీసుకున్న నిర్ణయమా? అనేది మాత్రం ఎప్పటికీ తేలదు. మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ ఇదే మాట చెప్పుకోవచ్చు.
మొత్తానికి దిల్ రాజు, మంచు విష్ణు ఇద్దరూ టాలెంట్ ను ప్రోత్సహించడంలో తమదైన మార్గాలను ఎంచుకున్నారు. వారి ప్రయత్నాలు కొత్తవారికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.


