
📌 Key Points
- డింపుల్ హయతి దాసరి నారాయణరావు మనవరాలని వెల్లడించారు.
- ఆమె నానమ్మ ఒకప్పటి హీరోయిన్ ప్రభ అని తెలిపారు.
- కుటుంబం సినిమా రంగంలోకి రావడానికి మొదట అంగీకరించలేదట.
- డింపుల్ రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించారు.
డింపుల్ హయతి తాను దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి మనవరాలని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఒకప్పటి హీరోయిన్ ప్రభ గారు తన నానమ్మ అని కూడా తెలిపింది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డింపుల్ హయతి నేపథ్యం
Dimple Hayati: ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే కొంతమంది తమ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెడితే..మరి కొంతమంది సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తాము ఫలానా సెలబ్రిటీల వారసులం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ బ్యూటీగా తన అందంతో గ్లామర్ తో నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన డింపుల్ హయతి (Dimple hayati) ఇండస్ట్రీ పెద్ద మనవరాలిని అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు మరొక హీరోయిన్ తన నానమ్మ అని కూడా చెప్పింది. మరి డింపుల్ హయతి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. ఖిలాడి సినిమాలో రవితేజ (Raviteja ) సరసన నటించి.. తనకంటూ ఒక పేరు దక్కించుకున్న డింపుల్ హయతి.. ఇప్పుడు మరోసారి రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో జతకట్టింది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డింపుల్ హయతితో పాటు ఆషికా రంగనాథ్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్న డింపుల్ హయతి తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కుటుంబం అంగీకారం వెనుక కష్టం
డింపుల్ హయతి మాట్లాడుతూ.. “స్వర్గీయ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు మా తాతగారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ ప్రభగారు మా నానమ్మ. మా కుటుంబంలో చాలామంది నటీనటులే ఉన్నారు. అయితే నేను సినిమాల్లోకి వస్తానంటే మాత్రం వారు అంగీకరించలేదు. అయితే నాకు నటనపై ఉన్న ఆసక్తి చూసి నాకు సపోర్ట్ చేశారు. లేదంటే నేను ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. ముఖ్యంగా వాళ్ళని ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు అనడంలో సందేహం లేదు.. మరి ఇన్ని రోజులు ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని ఎందుకు చెప్పకుండా దాచేసింది అంటూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే దాసరి మనవరాలు అని చెప్పి మరింత పాపులర్ అయిపోతోంది ఈ ముద్దుగుమ్మ.
డింపుల్ హయతి విషయానికి వస్తే.. తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగు, తమిళ్ భాషలలో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ స్టార్ స్టేటస్ మాత్రం లభించలేదు. నిజానికి పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చినా విజయం అందుకోలేకపోవడం వల్లే ఈమె వెనుకబడిపోయింది. ఇక 2023లో రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈమె.. ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ రీఎంట్రీ ఇస్తోంది. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా డింపుల్ కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.
రవితేజతో కలిసి నటిస్తున్న డింపుల్
మొత్తానికి డింపుల్ హయతి తన కుటుంబ నేపథ్యాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈ విషయం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


