
📌 Key Points
- డింక్ జంటలు ఆర్థిక స్వేచ్ఛతో విలాసంగా జీవిస్తున్నారు.
- పిల్లల బాధ్యతలు లేకపోవడంతో కెరీర్‌పై దృష్టి పెట్టవచ్చు.
- వ్యక్తిగత సమయం, ప్రశాంతత డింక్ లైఫ్‌స్టైల్ ప్రత్యేకతలు.
- భాగస్వాముల మధ్య అనుబంధం మెరుగుపడుతుందని కొందరి అభిప్రాయం.
ప్రస్తుత సమాజంలో డింక్ లైఫ్‌స్టైల్ ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. పిల్లలు వద్దనుకుని ఇద్దరూ సంపాదించే జంటలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
డింక్ లైఫ్‌స్టైల్‌తో ఆర్థిక స్వేచ్ఛ
ప్రస్తుత సమాజంలో “డింక్” అనేది ఒక కొత్త సామాజిక విప్లవంలా మారుతోంది. DINK అంటే.. రెండు ఆదాయాలు, పిల్లలు లేకపోవడం (Dual Income, No Kids). అంటే భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ, కావాలనే పిల్లల్ని వద్దనుకునే జంటలు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడాన్ని ఒక లోపంగా చూసేవారు, కానీ ఇప్పుడు అది ఒక ‘లైఫ్‌స్టైల్ ఛాయిస్’గా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, కార్పొరేట్ నిపుణులు ఈ ధోరణి వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం కెరీర్ మీద దృష్టి పెట్టడం, లేదా పిల్లల పెంపకానికి అయ్యే భారీ ఖర్చు, ఒత్తిడిని భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ బాగానే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అసలు డింక్ లైఫ్‌స్టైల్‌తో వచ్చే ప్రయోజనాలేంటి? కలిగే సమస్యలేంటి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ఈ ట్రెండ్‌ను అనుసరించే వారు ప్రధానంగా మూడు అంశాలను లాభాలుగా పేర్కొంటారు:
1. అపరిమితమైన ఆర్థిక స్వేచ్ఛ:
పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఆదా చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల దంపతులిద్దరి సంపాదన వారి విలాసాలకే సరిపోతుంది. ఖరీదైన కార్లు కొనడం, అంతర్జాతీయ పర్యటనలు చేయడం వీరికి సులువవుతుంది.
2. కెరీర్ వృద్ధిపై పూర్తి దృష్టి:
పిల్లల బాధ్యత లేకపోవడం వల్ల ఆఫీసు పనిలో ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు, విదేశీ అవకాశాలను వీరు త్వరగా అందిపుచ్చుకుంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ వృత్తిలో శిఖరాలను చేరుకుంటారు.
3. వ్యక్తిగత సమయం, మానసిక ప్రశాంతత:
కెరీర్ వృద్ధిపై పూర్తి శ్రద్ధ
పిల్లల పెంపకంలో ఉండే ఒత్తిడి, నిద్రలేని రాత్రులు వీరి జీవితంలో ఉండవు. తమకు నచ్చిన హాబీలను కొనసాగించడానికి, జిమ్, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టడానికి వీరికి తగినంత సమయం దొరుకుతుంది. భాగస్వాముల మధ్య అనుబంధం కూడా బలంగా ఉంటుందని కొందరు భావిస్తారు. అంతేకాదు, ఆర్థిక ఒత్తిడి ఉండదు కాబట్టి, ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగం నుంచి వైదొగలచ్చు కూడా.
“ఇండియాలో జీవితం అనేది ఒక ఫిక్స్డ్ స్క్రిప్ట్లా ఉంటుంది. కానీ మేము పిల్లలు వద్దనుకున్నాము. అప్పుడే కెరీర్, ఆరోగ్యం, రీలొకేషన్కి మాకు ధైర్యం వచ్చింది. ఆర్థికంగా కలిసొచ్చింది. ఇప్పుడు మేము డెడ్‌లైన్స్ వల్ల నిర్ణయాలు తీసుకోవడం లేదు. మా ఛాయిస్, ఆలోచనలతో తీసుకుంటాము. ఒత్తిడి తగ్గిపోయింది,” అని ఒక జంట ఇటీవలె రెడ్డిట్‌లో తమ డింక్ లైఫ్‌స్టైల్ గురించి చెప్పుకున్నారు.
ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టే, ఈ తరహా జీవనశైలిలో కూడా కొన్ని తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి.
1. వృద్ధాప్యంలో ఒంటరితనం:
యువవయస్సులో ఈ నిర్ణయం బాగానే ఉన్నా, వయస్సు పైబడిన తర్వాత మానసిక మద్దతు ఇచ్చే వారు ఉండకపోవడం ప్రధాన లోపం. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు లేదా భాగస్వామిని కోల్పోయినప్పుడు ఒంటరితనం భయపెట్టే అవకాశం ఉంది.
భారతీయ సమాజంలో “పిల్లలు లేనిదే సంసారం పూర్తికాదు” అనే బలమైన అభిప్రాయం ఉంది. దీనివల్ల బంధువులు, స్నేహితుల నుంచి నిరంతరం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పండుగలు, వేడుకల్లో వీరు కొంత ఇబ్బందిగా భావించే ప్రమాదం ఉంది.
మనిషికి తన తర్వాత తన వంశాన్ని లేదా తన ఆస్తులను చూసుకునే వారసుడు ఉండాలనే సహజమైన కోరిక ఉంటుంది. వయస్సు మళ్లిన తర్వాత తమ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు? తమ జ్ఞాపకాలు ఎవరితో మిగులుతాయి? అనే ప్రశ్నలు వీరిని వేధించవచ్చు.
డింక్ అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అయితే, నేటి రోజుల్లో పెరుగుతున్న విద్యా ఖర్చులు , జీవన ప్రమాణాల దృష్ట్యా మధ్యతరగతి జంటలు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారు. కేవలం ఆనందం కోసమే కాకుండా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేమేమో అన్న భయంతో కూడా కొందరు ఈ బాట పడుతున్నారు. ఏదేమైనా, జీవితాంతం తోడుండే భాగస్వామి మద్దతు ఉంటే ఏ నిర్ణయమైనా సరైనదే అని విశ్లేషకులు చెబుతున్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రశాంతత
డింక్ అంటే ‘Dual Income, No Kids’. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ, పిల్లలు వద్దని నిర్ణయించుకున్న జంటలను ఇలా పిలుస్తారు.
2. భారతదేశంలో డింక్ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది?
భారీగా పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల విద్య కోసం అయ్యే ఖర్చులు, కెరీర్ పట్ల పెరుగుతున్న ఆసక్తి, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం వల్ల ఈ ట్రెండ్ పెరుగుతోంది.
3. డింక్ జంటలు వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారా?
అవును, శారీరక శక్తి తగ్గినప్పుడు చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల ఒంటరితనం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక, సామాజిక వర్గాలతో సంబంధాలు ఉన్నవారు దీన్ని అధిగమిస్తున్నారు.
4. ‘సింక్’కు దీనికి తేడా ఏంటి?
సింక్ (SINK – Single Income, No Kids) అంటే ఒకరు మాత్రమే సంపాదిస్తూ పిల్లలు లేని జంట. డింక్‌లో ఇద్దరూ సంపాదిస్తారు కాబట్టి ఆర్థికంగా మరింత బలంగా ఉంటారు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
డింక్ లైఫ్‌స్టైల్ అనేది వ్యక్తిగత ఎంపిక. ఆర్థిక స్వేచ్ఛ, కెరీర్ వృద్ధికి ఇది ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఒంటరితనం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


