|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ఫ్యాన్స్‌ను కెలికిన మారుతి: రాజుకుంటున్న వివాదం, ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారు?

Published: 29-12-2025, 8:26 AM
ప్రభాస్ ఫ్యాన్స్‌ను కెలికిన మారుతి: రాజుకుంటున్న వివాదం, ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారు?
  • మారుతి ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌ను ‘మిడ్ రేంజ్ హీరో’ అన్నాడు.
  • ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • “బాహుబలి ముందు నుంచే ప్రభాస్ స్టార్ హీరో” అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
  • ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ఈ కామెంట్‌ను వైరల్ చేసి వివాదానికి ఆజ్యం పోశారు.

దర్శకుడు మారుతి ఇటీవల ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ప్రభాస్‌ను ‘మిడ్ రేంజ్ హీరో’ అనడంపై డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారుతిపై ఫైర్ అవుతూ, ఈ వివాదం ఎలా రాజుకుంది? అసలు మారుతి ఏమన్నాడు? అనేవి ఇప్పుడు చూద్దాం.

మారుతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు

Director Maruthi : ‘ది రాజా సాబ్’ మూవీ డైరెక్టర్ మారుతి ఓ వివాదంలో ఇరుకున్నాడు. ఏకంగా ప్రభాస్ అభిమానులనే కెలికాడు. ఇప్పుడు మారుతిపై డార్లింగ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది మాట్లాడుతారా… మా హీరోనే కించపరిస్తావా అంటూ మారుతిపై గరం గరం అవుతున్నారు. అసలు ప్రభాస్‌ను డైరెక్టర్ మారుతి ఏం అన్నాడు? ప్రభాస్ అభిమానులు ఎందుకు అంతలా సీరియస్ అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో స్టేజ్‌పై మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో.. అవి ఎంత పెద్ద దుమారానికి తెరలేపాయో అందరూ చూశారు. తాజాగా డైరెక్టర్ మారుతి కూడా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఏంటి?

మొన్న ది రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అయితే.. అదే ఈవెంట్‌లో.. అదే స్పీచ్‌లో డైరెక్టర్ మారుతి నోట వచ్చిన ఓ పదం ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

స్పీచ్ మధ్యలో మారుతి… ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో అని అన్నాడు. మిడ్ రేంజ్ హీరోగా ఉన్న ప్రభాస్‌ను రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ని చేశాడు అని అన్నాడు. తమ హీరోను మిడ్ రేంజ్ హీరో అనడంపై… ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాహుబలి ముందు నుంచే ప్రభాస్ టైర్ 1, స్టార్ హీరో అని గుర్తు చేస్తున్నారు.

మాటల యుద్ధానికి తెర లేపింది ఎవరు?

అయితే… మారుతి ఫుల్ స్పీచ్‌లో ఈ మిడ్ రేంజ్ హీరో అనేది చిన్న పదమే. దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్‌ కూడా క్యాచ్ చేయలేదు. ముందుగా ఈ కామెంట్‌ను ప్రభాస్ యాంటి ఫ్యాన్స్ పట్టుకున్నారు. ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో అని.. అది ఆయన డైరెక్టరే అన్నాడు అంటూ ట్రోల్స్ చేశారు. అది అలా… వైరల్ అవ్వడంతో.. మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో అనడంతో మారుతిపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న వ్యాఖ్య ఇప్పుడు పెద్ద వివాదానికి తెర లేపింది. చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది మాట్లాడతారా అంటూ మారుతిని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.