|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుడ్డు వివాదంలో గరికపాటిపై బాబు గోగినేని ఫైర్! పవన్ కళ్యాణ్ పేరుతో సంచలనం!

Published: 31-03-2026, 6:45 AM
గుడ్డు వివాదంలో గరికపాటిపై బాబు గోగినేని ఫైర్! పవన్ కళ్యాణ్ పేరుతో సంచలనం!
  • గరికపాటి గుడ్డు వ్యాఖ్యలపై బాబు గోగినేని తీవ్ర విమర్శలు.
  • గుడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించిన బాబు గోగినేని.
  • పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన బాబు గోగినేని వ్యాఖ్యలు.
  • దేశంలో ఆహార వృధాపై బాబు గోగినేని ఆవేదన.

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన గుడ్డు వ్యాఖ్యలపై హేతువాది బాబు గోగినేని స్పందించారు. ఆయన గరికపాటిని విమర్శించడంతో పాటు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. దీనిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గరికపాటి వ్యాఖ్యలపై బాబు గోగినేని విమర్శలు

Babu Gogineni: బాబు గోగినేని పరిచయం అవసరం లేని పేరు. ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. హేతువాది మానవతావాది అయినటువంటి బాబు గోగినేని సమాజంలో జరుగుతున్న అంశాల గురించి స్పందిస్తూ ఈయన మాట్లాడే మాటతీరు వివాదాస్పదంగా ఉంటుంది. ఏ విషయం అయినా ముక్కు సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు(Garikapati Narasimharao) పిల్లలకు పాఠశాలలలో పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం అలాగే కోడిగుడ్డుపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదానికి కారణమయ్యాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పిల్లలకు బడిలో కోడిగుడ్డు మధ్యాహ్నం భోజనం పెట్టి ఏదో శోభనపు పెళ్ళికొడుకుని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. పిల్లలకు బడిలో కోడిగుడ్డు పెట్టడం అవసరమా అంటూ ఈయన మాట్లాడిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పేద పిల్లలకు కడుపునిండా భోజనం పెడితే ఓర్వలేని స్థితిలో ఉన్నారా అంటూ ఈయనపై ఎంతోమంది విమర్శలు కురిపించారు. అయితే తాజాగా ఈ విషయంపై బాబు గోగినేని కూడా స్పందించారు. బాబు గోగినేని గరికపాటి గుడ్డు వివాదం పై స్పందిస్తూ గరికపాటి గుండు పై గుడ్డుతో కొట్టాలంటూ విమర్శించారు.

ఈ సందర్భంగా బాబు గోగినేని ఈ అంశంపై స్పందిస్తూ.. మనదేశంలో రాళ్ళ మీద పాలు పోసి, పిండాలు పెట్టి ఆహారం వృధా చేస్తుంటారు. ఇది కాకుండా అదనంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫోటోలకు పాలాభిషేకం చేస్తే లేని నొప్పి పిల్లలకు గుడ్డు పెడితే వచ్చిందా.. గరికపాటి గుండు మీద గుడ్డుతో కొట్టాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా గరికపాటి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన పట్ల విమర్శలు చేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు బాబు గోగినేని పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

గుడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన

“Global Hunger index లో 102 position లో ఉన్న country లో రాళ్ళ మీద పాలు పోసి…పిండాలు పెట్టి ఆహరం waste చేసి…అదనంగా PawanKalyan ఫోటోల మీద పాలు పోసి…waste చేస్తే లేని నొప్పి…పిల్లలకి గుడ్డు పెడితే వచ్చిందా…గరికపాటి గుండు మీద గుడ్ల తో కొట్టాలి” – #BabuGogineni pic.twitter.com/zr4kKOnIdT

— Daily Culture (@DailyCultureYT) March 31, 2026

బాబు గోగినేని వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం

గుడ్డు వివాదం గురించి గరికపాటి పై మాట్లాడుతూ విమర్శించడం వరకు పర్లేదు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు అంటూ మండిపడుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోలకు మాత్రమే పాలాభిషేకం చేయడం లేదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తీసుకురావడం ఏంటి అంటూ బాబు గోగినేని పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇక గతంలో కూడా బాబు గోగినేని పవన్ కళ్యాణ్ గురించి పలు సందర్భాలలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఇలా గుడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడంతో పవన్ అభిమానులు బాబు గోగినేని తీరుపై మండిపడుతున్నారు.

మొత్తానికి గరికపాటి గుడ్డు వివాదం మరింత ముదిరింది. బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.