|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ యాసపై ఈషా రెబ్బా సంచలన వ్యాఖ్యలు! అంత మాట అనేసిందేంటి?

Published: 28-01-2026, 5:35 AM
తెలంగాణ యాసపై ఈషా రెబ్బా సంచలన వ్యాఖ్యలు! అంత మాట అనేసిందేంటి?
  • తెలంగాణ యాస కొట్టినట్లు ఉంటుందని ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం.
  • ఆంధ్ర యాసలో బూతులు లేకున్నా కాస్త కఠినంగా ఉంటుందని ఈషా అభిప్రాయం.
  • పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన ఈషా రెబ్బా.. సరైన సమయంలో అన్నీ జరుగుతాయంది.
  • ఓం శాంతి శాంతి శాంతిహి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈషా ఈ కామెంట్స్ చేసింది.

నటి ఈషా రెబ్బా తెలంగాణ యాసపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిహి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

తెలంగాణ యాసపై ఈషా రెబ్బా కామెంట్స్

Eesha Rebba: ఇటీవల నటి ఈషా రెబ్బా తన కొత్త సినిమా ఓం శాంతి శాంతి శాంతిహి ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఆమె హీరోగా నటించిన తారుణ్ భాస్కర్‌తో కలిసి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈషా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ యాస కొట్టినట్టు ఉంటుంది అని ఈ హీరోయిన్ అనడంతో అది కాస్త వివాదానికి దారి తీసింది..

ఇంటర్వ్యూలో ఆమె ఆంధ్ర, తెలంగాణ స్లాంగ్స్ గురించి తన అభిప్రాయాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది. “నాకు తెలంగాణ యాస మాట్లాడటం చాలా కష్టం. మాట్లాడితే కొట్టినట్టే అనిపిస్తుంది. కానీ అది వినడానికి చాలా బాగుంటుంది. ఆ యాసలో మాట్లాడేటప్పుడు.. గౌరవం కనిపిస్తుంది. మాటలు కాస్త గట్టిగా ఉన్నా కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అదే ఆంధ్ర యాస విషయానికి వస్తే, బూతులు మాట్లాడకపోయినా మాటలు కాస్త హార్ష్‌గా అనిపిస్తాయి. కానీ దీనికి కూడా ఒక స్టైల్ ఉంది. డైరెక్ట్‌గా మాట్లాడే విధానం అది” అని చెప్పింది.

నెటిజన్ల ఆగ్రహం

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు ఆమె మాటలను సరదాగా తీసుకోగా.. మరికొందరు ముఖ్యంగా తెలంగాణకు చెందిన కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ భాష కొట్టినట్లు ఉంటుంది అని ఎలా అనగలుగుతారు.. అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈషా చెప్పిన మాటలను గమనిస్తే, ఆమె ఎక్కడా ఏ ప్రాంతాన్ని తక్కువ చేయలేదు. రెండు యాసలకూ ఉన్న ప్రత్యేకతను.. స్టైల్‌ను మాత్రమే చెప్పేందుకు ప్రయత్నించింది.

ఇక అదే ఇంటర్వ్యూలో ఆమెపై వినిపిస్తున్న పెళ్లి వార్తల గురించి కూడా స్పందించింది. “మన కంట్రోల్‌లో లేని విషయాలను ప్లాన్ చేయలేం. సరైన సమయానికి సరైనవి జరుగుతాయి. నా జీవితంలో ఏదైనా ముఖ్యమైన విషయం జరిగితే, నేను స్వయంగా ప్రకటిస్తాను” అని చాలా ప్రశాంతంగా చెప్పింది. అయితే ఈ సినిమా హీరో తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు గత కొద్దిరోజుల నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ విషయం గురించి త్వరలోనే టైం వచ్చినప్పుడు చెపుతా అని.. కేవలం టైం కోసం చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

పెళ్లి వార్తలపై ఈషా స్పందన

ఈ సినిమా మలయాళ హిట్ మూవీ జయ జయ జయ జయ హేకి రీమేక్ కావడం కూడా ఆసక్తిని పెంచుతోంది. మొత్తం మీద ఈషా రెబ్బా మాటలను అర్థం చేసుకుని చూస్తే.. అవి వివాదం కోసం కాదు, యాసలపై ఆమె వ్యక్తిగత అనుభవాన్ని సాదాసీదాగా చెప్పిన వ్యాఖ్యలేనని చెప్పాలి.

మొత్తానికి ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె మాటలను ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.