
📌 Key Points
- తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
- సినిమా షూటింగ్ నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు వైరల్ అయ్యాయి.
- పెళ్లి పుకార్లపై ఈషా రెబ్బా ఇన్‌స్టాగ్రామ్‌లో చమత్కారంగా స్పందించింది.
- “ఆ సమయానికి కచ్చితంగా జరుగుతుంది” అనే డైలాగ్‌తో ఆమె వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బాల మధ్య ప్రేమాయణం, పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా ఈషా రెబ్బా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి అభిమానులకు, నెటిజన్లకు షాకిచ్చింది.
ఈషా రెబ్బా – తరుణ్ భాస్కర్ లవ్ రూమర్స్
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా(Eesha Rebba) ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో జోడీగా కనిపించనున్నారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లోనే ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ప్రేమలో పడినట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నరనే పుకార్లు షికారు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
కొన్ని పోస్టుల వల్ల ఈ ప్రచారం మరింత వేగంగా వ్యాపించింది. దీంతో టాలీవుడ్ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యన ఈ విషయం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ విషయం కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా కావడంతో.. అది కాస్త ఈషా రెబ్బా దృష్టిలో పడింది. తాజాగా, ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి షాకిచ్చింది. ‘ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగేవారికి.. ఈషా ఒక వైరల్ మీమ్ వీడియోతో అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘‘ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పాత ఇంగ్లీష్ స్పీచ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించింది.
పెళ్లి వార్తలపై ఈషా షాకింగ్ రియాక్షన్
‘‘ఏ ఏ పనులు, ఏ ఏ సమయాల్లో జరగాలో.. ఆయా పనులు ఆయా సమయాల్లో జరిగి తీరుతాయి’’ అనే డైలాగ్‌తో ఈషా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఇక ఇందులో ఆమె రెడ్ అండ్ ఎల్లో కలర్ చీరలో కనిపించడం విశేషం. పెళ్లి గురించి తనకేమీ తొందర లేదని, అంతా కాలమే నిర్ణయిస్తుందని ఆమె చాలా చమత్కారంగా చెప్పేసింది. ఈషా చేసిన ఈ సెటైరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రిస్మస్ గిఫ్ట్ కింద నిశ్చితార్థం.. లాంటివి ఏమైనా ప్లాన్ చేశారా? అని ఓ నెటిజన్ పెట్టగా.. మరో నెటిజన్ ఆల్రేడీ ఫిక్స్ అయిందని కామెంట్ పెట్టాడు. మరికొందరైతే అప్పుడే కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈషా వీడియో వైరల్
A post shared by Eesha Rebba (@yourseesha)
ఈషా రెబ్బా తన పెళ్లి వార్తలపై చాలా చమత్కారంగా, సమయస్ఫూర్తితో స్పందించింది. ఆమె ఇచ్చిన ఈ రిప్లై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


