
📌 Key Points
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్‌ను భార్య బ్రిగిట్టే చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్.
- ఓ జర్నలిస్ట్ పుస్తకం ప్రకారం, ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫరాహానీతో చాటింగ్ కారణం.
- మాక్రన్ ఫోన్‌లో సందేశాలు చూసిన బ్రిగిట్టే ఆగ్రహంతో చేయిచేసుకుందని పుస్తకంలో ఉంది.
- ఈ ఆరోపణలను మాక్రన్, నటి ఫరాహానీ ఖండించారు, ఇది కేవలం పుకార్లని తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్, ఆయన భార్య బ్రిగిట్టే మధ్య గొడవలకు కారణం ఓ ఇరాన్ నటి అని కొత్త పుస్తకం సంచలనం సృష్టించింది. మాక్రన్ ఫోన్‌లో చాటింగ్ చూసి బ్రిగిట్టే చెంపదెబ్బ కొట్టిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మాక్రన్ చెంపదెబ్బ వెనుక అసలు కథ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్‍ను అతడి భార్య బ్రిగిట్టే చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది వియత్నాం పర్యటన సందర్భంగా విమానం నుంచి దిగుతున్న సమయంలో ఇమ్మానుయేల్ మాక్రన్‍ను అతడి సతీమణి చేయిచేసుకున్నారని ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి చర్చగా మారింది. ప్రెసిడెంట్‍పై ఆయన సతీమణి తోసివేస్తున్నట్లు కనబడుతున్న సమయంలోనే విమానం తలుపులు తెరుచుకోవడం ఈ సన్నివేశం మీడియా కంట పడటంతో వీరిద్ధరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు ప్రపంచ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనపై తాజాగా సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి. తాజాగా జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన తన కొత్త పుస్తకం ‘యాన్ (ఆల్‌మోస్టు) పర్‌ఫెక్ట్ కపుల్’ లో ఇమ్మానుయేల్ మాక్రన్ అతడి భార్య బ్రిగిట్టే విభేదాలకు ఓ ఇరాన్ నటీ కారణం అని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్ నటితో ‘ప్లాటోనిక్’ బంధం
ఫ్రెంచ్ మీడియాలో కథనాల ప్రకారం గత ఏడాది మే లో హనోయి (Hanoi)లో వెలుగు చూసిన వీడియో వెనుక ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫరాహానీతో మెక్రాన్ బంధం ఉన్నట్లు ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాల ప్రకారం మాక్రాన్ ఆ నటితో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ నటికి, మెక్రాన్ మధ్య కొన్ని నెలల పాటు ఈ బంధం సాగిందని అయితే వీర మధ్య ‘ప్లాటోనిక్ రిలేషన్‌షిప్’ (కేవలం మానసిక అనుబంధం) కొనసాగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. నటికి మెక్రాన్ పంపిన సందేశాలను మెక్రాన్ ఫోన్‍లో చూసిన అతడి భార్య బ్రిగెట్టే అతడి చెంప వాయించిందని, బయటకు కనిపించిన దృశ్యం కంటే ముందు ఫరాహానీతో జరిగిన మెసేజ్‌ల వ్యవహారంపై ఈ దంపతుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిందని పుస్తకంలో పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన మాక్రన్ దంపతులు
అయితే వాస్తవాల ఆధారంగా తాను పుస్తకం రాశానని రచయిత చెబుతుంటే ఈ ఆరోపణలను మాక్రాన్ , ఆతడి భార్య ఇద్దరూ తిరస్కరించారు. నటి ఫర్హానీ కూడా ఈ రిలేషన్‍షిప్ వార్తలను తోసిపుచ్చారు. బ్రిగిట్టే ప్రతినిధులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేశారు. ఆమె తన భర్త ఫోన్‌ను ఎన్నడూ చెక్ చేయరని కూడా అన్నారు. మరోవైపు ఇరాన్ నటి ఫర్హానీ కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. తన భార్యకు మధ్య లాంటి గొడవ లేదని అది మత మధ్య జరిగిన సరదా సన్నివేశమని గతంలోనే మెక్రాన్ స్పందించగా ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసే నటి గోల్షిఫ్తే ఫరాహానీకి అధ్యక్షుడికి మధ్య సంబంధాలున్నాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారింది.
ఈ వివాదం ఫ్రాన్స్ రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చకు దారితీసింది. అధ్యక్షుడి వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఈ ఆరోపణలు, వాటి ఖండనలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.


