
📌 Key Points
- గోవాలోని వాగేటర్ బీచ్‌లో ఫార్చూనర్ కారును సముద్రంలోకి తీసుకెళ్లిన పర్యాటకులు.
- గుజరాత్ రిజిస్ట్రేషన్ గల కారు ఇసుకలో కూరుకుపోవడంతో వైరల్ వీడియో.
- బీచ్‌లో వాహనాలపై నిషేధం ఉన్నా, పర్యాటకుల అతిక్రమణలు కొనసాగుతున్నాయి.
- జేసీబీ సహాయంతో కారును బయటకు తీసిన అధికారులు, స్థానికుల ఆగ్రహం.
గోవాలోని వాగేటర్ బీచ్‌లో పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టయోటా ఫార్చూనర్ కారును సముద్రంలోకి తీసుకెళ్లడంతో అది ఇసుకలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాగేటర్ బీచ్‌లో వాహన బీభత్సం
గోవాలోని వాగేటర్ (Vagator) బీచ్‌లో పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ సముద్రపు నీటిలోకి టయోటా ఫార్చూనర్ (Toyota Fortuner) కారును తీసుకెళ్లారు. చివరికి ఆ కారు తడి ఇసుకలో కూరుకుపోయింది. గుజరాత్ (GJ) రిజిస్ట్రేషన్ ఉన్న ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోవా బీచ్‌లకు దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది. అయితే, కొందరు పర్యాటకులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుండటం భద్రతా, పర్యావరణ పరమైన ఆందోళనలను పెంచుతోంది. బీచ్‌లలోకి వాహనాలను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉన్నప్పటికీ, సదరు పర్యాటకులు తమ కారును ఏకంగా సముద్రపు నీటిలోకి పోనిచ్చారు. అలల తాకిడికి ఇసుక మెత్తబడటంతో కారు బరువుకు అందులో పూర్తిగా ఇరుక్కుపోయింది.
కారు ఇసుకలో కూరుకుపోవడంతో అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక అధికారుల సహాయం కోరడానికి బదులుగా.. మరో కారుకు తాడు కట్టి ఫార్చూనర్‌ను బయటకు లాగేందుకు విఫల యత్నం చేశారు. చాలాసేపటి వరకు జరిగిన ఈ తతంగం అక్కడి బీచ్ సందర్శకులకు ఒక వినోదంగా మారింది. అనంతరం జేసీబీతో కారును అక్కడి నుంచి బయటకు తీశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని, పర్యాటకులు నిబంధనలను ఉల్లంగించి బీచ్‌లో వాహనాలు నడుపుతున్నారని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు.
ఇసుకలో కూరుకుపోయిన ఫార్చూనర్
నిబంధనలు ఉల్లంఘించిన పర్యాటకులు
పర్యాటకులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భద్రత, పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


