
📌 Key Points
- పెళ్లి ముహూర్తాల వేళ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
- హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2510 పెరిగింది.
- 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2300 పెరిగి రూ.1,35,750కి చేరింది.
- వెండి ధర కిలోకు రూ.5000 పెరిగి రూ. 2,50,000కు చేరింది.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతవారం తగ్గిన ధరలు ఈ వారం ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధరలకు రెక్కలు!
పెళ్లిళ్లు, శుభకార్యాల ముహూర్తాల సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని ఆనందించే లోగానే ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతవారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం ఊహించని రీతిలో పెరుగుతూ.. కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దగ్గరలో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకుని, ఇంకా బంగారం కొనుగోలు చేయని వారికి ఇది అదనపు భారమనే చెప్పాలి. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2510 పెరిగి రూ.1,48,090కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ర.2300 పెరిగి రూ.1,35,750కి ఎగబాకింది. ఇక వెండి విషయానికొస్తే.. నిన్న రూ.10 వేలు తగ్గగా నేడు రూ.5000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 2,50,000కు చేరింది. పెరిగిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, లైవ్ ట్రేడింగ్ ను బట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యే ఛాన్సుంది.
హైదరాబాద్ మార్కెట్‌లో తాజా ధరలు
వెండి ధరల్లో భారీ పెరుగుదల
బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వేచి చూడటం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


