|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను టార్గెట్ చేసి అసభ్యకర ప్రశ్నలతో వేధిస్తున్నారు.. గౌరీ కిషన్ ఎమోషనల్ పోస్ట్

Published: 06-11-2025, 11:25 PM
నన్ను టార్గెట్ చేసి అసభ్యకర ప్రశ్నలతో వేధిస్తున్నారు.. గౌరీ కిషన్ ఎమోషనల్ పోస్ట్

యంగ్ హీరోయిన్ గౌరీ జి కిషన్ ఇటీవల ఒక ప్రెస్‌మీట్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన బరువు గురించి అసభ్యకర ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుల తీరుపై నటి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Key Points

1

ప్రెస్‌మీట్‌లో గౌరీ కిషన్‌ను బరువు గురించి బాడీ షేమింగ్ ప్రశ్నలు అడిగారు.

2

నటి ఈ ఘటనపై తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

4

శారీరక సమస్యలున్నాయని, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు వద్దని విజ్ఞప్తి చేసింది.

నటి గౌరీ కిషన్‌కు ఎదురైన అవమానం

సాధారణంగా కొందరు హీరోయిన్లను పలు ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. హీరోయిన్లు సైతం తమకు అసౌకర్యంగా ఉన్న ప్రశ్నలు అడిగితే.. కొందరు మీడియాపై ఫైర్ అయ్యారు. అలాగే ఈ వివాదాలు కాస్త కేసుల వరకు కూడా వెళ్లాయి. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంతో పాపులారిటీ తెచ్చుకుని హీరోయిన్‌గా మారింది గౌరీ జి కిషన్(Gouri G. Kishan). త్వరలో ‘అదర్స్’ చిత్రంతో రాబోతున్న ఈ భామ ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొనగా.. ఘోర అవమానం జరిగింది. ఇందులో ఓ రిపోర్టర్ మీ బరువు ఎంత? ఎంత పెరిగావ్ అని బాడీ షేమింగ్ చేశాడు. ఇక ఈ విషయంపై ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది.

తాజాగా, ఈ విషయంపై గౌరీ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘జరిగిన దానికి పూర్తిగా దిగ్భ్రాంతి చెందాను. నటి బరువు గురించి తాను అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ పట్టుబట్టారు. ఇదేమీ కొత్త కాదు. బెదిరింపులు కొత్త కాదు, లైంగిక వేధింపుల ప్రశ్నలు కొత్త కాదు. రెండు రోజుల క్రితం, మరొక ప్రెస్ మీట్‌లో, ఒక పురుష రిపోర్టర్ కోయంబత్తూర్ కమిషనర్‌ను అత్యాచార బాధితురాలు “పూర్తిగా నగ్నంగా ఉందా లేదా అర్థ నగ్నంగా ఉందా” అని అడిగాడు. ఇది జర్నలిజం కాదు. ఇవి వేధింపులతో సమానం.

సోషల్ మీడియాలో గౌరీ కిషన్ భావోద్వేగ పోస్ట్

నా బరువు గురించి తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యం, అది సినిమాకి ఏమైనా సంబంధం ఉందా ?? ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను ?? ఇది సరైన జర్నలిజం కాదు. ప్రతి స్త్రీకి ప్రత్యేక శరీర రకం ఉంటుంది. నాది భిన్నంగా ఉంది. నేను హార్మోన్ల సమస్యలతో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా. బహిరంగ ప్రదేశాలలో నాకు అసౌకర్యంగా అనిపించే దాని గురించి మాట్లాడటం నాకు అంత అవసరం లేదు. ఇక్కడ ఒక్క మహిళా జర్నలిస్ట్ కూడా లేరు.. నన్ను టార్గెట్ చేసి ఇలాంటి ప్రశ్నలతో చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధగా ఉంది’’ అని రాసుకొచ్చింది.

జర్నలిజం తీరుపై గౌరీ కిషన్ ఆగ్రహం

A post shared by Dhanya Rajendran (@dhanyarajendran)

జర్నలిజం పేరుతో నటీనటులను వ్యక్తిగత ప్రశ్నలతో వేధించడం ఎంతమాత్రం సరికాదని గౌరీ కిషన్ పోస్ట్ స్పష్టం చేస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.