|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చిన్ననాటి ఫోటోలో తమన్! గుర్తుపట్టారా? అసలు సీక్రెట్ ఏమిటో తెలుసా?

Published: 27-01-2026, 1:05 AM
షాకింగ్: చిన్ననాటి ఫోటోలో తమన్! గుర్తుపట్టారా? అసలు సీక్రెట్ ఏమిటో తెలుసా?
  • సంగీత దర్శకుడు తమన్ బాల్యంలో ‘బాయ్స్’ సినిమాలో నటించారు.
  • తమన్ మొదట రవితేజ ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.
  • ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
  • తమన్ దాదాపు 100 సినిమాలకు సంగీతం అందించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఆ తరువాత రవితేజ ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారారు. ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమన్ సినీ ప్రస్థానం: నటుడి నుండి సంగీత దర్శకుడిగా

Guess The Actress : సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య సెలబ్రిటీల ఫ్యామిలీ గురించి, లేదా వాళ్ళ చిన్ననాటి ఫోటోలు గురించి తెలుసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సినీ తారల ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. పైన కనిపిస్తున్న ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకప్పుడు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.. ఆయన ఎవరో గుర్తుపట్టారా..? టాప్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనే అని చెప్పవచ్చు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికైనా ఐడియా వచ్చిందా..? అవును మీరు గెస్ చేసింది అక్షరాల నిజమే… మీరు అనుకుంటున్న వ్యక్తి ఆయనే ఈయన.. ఆ డైరెక్టర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. మరెన్నో పాటలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ముందు సినిమాలలో కీలక పాత్రలో నటించారు.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పైన కనిపిస్తున్న ఫోటో బాయ్స్ చిత్రంలోనిది. హీరో సిద్ధార్థ్ జెనీలియా జంటగా నటించిన ఏ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అందరి మనసు దోచుకున్నాడు. ఈమధ్య సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ ని అందిస్తున్న తమన్ గురించి అభిమానులు తెలుసుకుంటున్నారు.. అలా ఈ ఫోటో మరోసారి బయటకొచ్చింది..

‘బాయ్స్’ సినిమాలో తమన్ బాల్యం

టాలీవుడ్ లో తమన్ సక్సెస్

ఈయన అసలు పేరు.. ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్.. ఈయన తెలుగు, తమిళ చిత్రాలకు పనిచేస్తున్నారు.. ఇతను శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో ఒక సహాయ పాత్రలో నటించాడు.. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన దాదాపు 100 సినిమాలకు తన మ్యూజిక్ ను అందించారు.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ని అందిస్తున్నారు.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటగా వినిపించే పేరు ఎస్ఎస్ తమన్. ప్రేక్షకుల నాడి తెలుసుకున్న ఈయన వాళ్ళని అలరించే విధంగా తన స్టైల్ లో మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో స్టార్ హీరోలు ఈయనను మ్యూజిక్ డైరెక్టర్ గారు రెఫర్ చేస్తున్నారు.. మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు..

ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఆయన అందించిన సంగీతం ఎన్నో విజయాలు సాధించింది. భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు అందిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.