|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి మీద మీనా రివేంజ్- తోడి కోడళ్ల అవమానం- భర్తపై మౌనిక పంచులు- మల్లెపూలతో శ్రుతి

Published: 24-07-2025, 11:48 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి మీద మీనా రివేంజ్- తోడి కోడళ్ల అవమానం- భర్తపై మౌనిక పంచులు- మల్లెపూలతో శ్రుతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో కోడళ్ళ మధ్య గొడవలు, భర్తలతో విభేదాలు, మరియు ప్రతీకారాలతో ఉత్కంఠభరితమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. మీనా, రోహిణి, మౌనిక మరియు శ్రుతిల కథ ఎలా కొనసాగుతుందో చూద్దాం.

తోడి కోడళ్ళ మధ్య వైరం

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లయిన తొలిసారి అందరితో కలిసి చాలా సంతోషంగా గడిపాను. వెళ్లొస్తాను అని వెళ్తారు మౌనిక, సంజు . ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారు. డబ్బుడమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నది ఎవరు చెప్పారు. ఇన్ని తెలుసుకున్న వీడు గుడి మెట్ల మీద అడుక్కుంది కూడా తెలుసా అని బాలు అంటాడు.

ఎవరు అడుక్కున్నారని శ్రుతి అడిగుతుంది. బాలు చెప్పబోతుంటే నోట్లో కేక్ పెట్టి ఆపుతుంది మీనా. టెర్రస్‌పై ఉన్న రవి దగ్గరికి వెళ్లిన మనోజ్ అత్త మామలతో మంచిగా ఉండాలని, రేపు రెస్టారెంట్ పెట్టుకోడానికి మీ మావయ్యేగా డబ్బులిచ్చేదని అంటాడు. నా సంగతి సరే మీ మామ సంగతి ఏమైంది అని రవి అడుగుతాడు. ఆయన పార్ట్‌నర్స్ మోసం చేశారట, ఏదో సమస్య అట అని మనోజ్ అంటాడు.

ఎప్పుడు ఇంకొకరి సాయం గురించి ఎదురుచూడొద్దు అని ఎగ్జాంపుల్‌గా బాలు గురించి చెబుతాడు రవి. శ్రుతి కూడా మీనా వదినలా ఉంటే బాగుండు. ఎప్పుడు ఏ గొడవ తెస్తుందో అని భయంగా ఉందని రవి అంటాడు. ఇంతలో బాలు వస్తాడు. నీ వల్లే మేము కలిశాం. మళ్లీ ఏ సమస్య వస్తుందో భయంగా ఉందని బాలుతో అంటాడు రవి. నీలాంటి వాళ్లు ఆరు నెలల్లో ప్రేమిస్తారు. ఆరు నెలలకు కోర్టు ముందు ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకు అని బాలు అంటాడు.

అంతవరకు రాదు. నాకు శ్రుతి అంటే చాలా ఇష్టం అని రవి అంటాడు. మరోవైపు టీ పెట్టిస్తావా అని మీనాను అడుగుతుంది శ్రుతి. రోహిణి కూడా వచ్చి అడుగుతుంది. ఇది మనకు మీటింగ్ స్పాట్‌లా అయింది. పగలంతా మావయ్య, అత్తయ్య ఉంటారు. బయటకెళ్లి సంపాదించేవాళ్లం మీనాలా ఇంట్లో ఉండే కుదరదుగా అని మీనా నొచ్చుకునేలా అంటుంది రోహిణి.

మీనా ఇంట్లో ఉంటూనే పూలు అమ్ముతుంది. బాలుకు కారు కొనిచ్చింది. మనోజ్‌కు నువ్వేం కొనివ్వలేదు కదా అని శ్రుతి దెప్పిపొడుస్తుంది. దాంతో నువ్ రావేమో అనుకున్నా అని మీనా మాట మార్చేస్తుంది. సురేంద్రను కొట్టింది పదే పదే గుర్తు చేస్తుంది రోహిణి. మీనాను మా నాన్న క్షమించమని అడిగిన తప్పు లేదు. తప్పు బాలు, మా నాన్న ఇద్దరివైపు ఉంది అని శ్రుతి అంటుంది.

భర్తలతో సమస్యలు

మా ఆయన మీద శ్రుతికి కోపం లేకపోయినా నువ్వెందుకు పదే పదే గుర్తు చేస్తున్నావ్ అని మీనా అంటుంది. అంటే శ్రుతి ఎలా వచ్చిందా అని రోహిణి అంటే మీనా కోసం బాలు కొట్టాడు. రవి ఇబ్బంది పడ్డాడు. మొగుడుపెళ్లాం అన్నాక గొడవలు వస్తాయి. సర్దుకుపోతాం కదా అని శ్రుతి అంటుంది. బాలు, మీనా గొడవలు చూస్తే కోర్టుకు వెళ్తారేమో అనిపిస్తుంది అని రోహిణి అంటుంది.

మా మధ్య అంతపెద్ద గొడవలు ఏమయ్యాయి అని మీనా అంటుంది. ఏ మొగుడుపెళ్లాలకైనా గొడవలు వస్తాయి. మొగుడు ఏమైపోయిన పర్లేదు అనుకునేవాళ్లకే గొడవలు రావు అని ఇన్‌డైరెక్ట్‌గా రోహిణినే అంటుంది శ్రుతి. కరెక్ట్‌గా చెప్పావ్. మనోజ్ జాబ్ చేయకున్నా రోహిణి ఏమనదు. రోహిణి పార్లర్ అమ్మేసిన మనోజ్ ఏమనడు. రోహిణి వాళ్ల ఆయన కెనడా వెళ్తే ఏంటీ వెళ్లకపోతే ఏంటీ అని అనుకోబట్టే కదా గుడి మెట్ల మీద అడుక్కున్నాడు పాపం అని శ్రుతికి చెప్పేస్తుంది మీనా.

దాంతో రోహిణి అవమానంగా ఫీల్ అవుతుంది. రోహిణి మీద మీనా రివేంజ్ తీర్చుకున్నట్లు చూస్తుంది. దాంతో శ్రుతి షాక్ అవుతుంది. జరిగింది అంతా మీనా పూసగుచ్చినట్లు చెబుతుంది. డబ్బుల కోసం అంతలా దిగజారారా అని శ్రుతి అంటుంది. తర్వాత బాలుకు కాల్ చేసి తీసుకొచ్చినట్లుంది చెబుతుంది మీనా. దీక్ష చేస్తే కెనడా వెళ్లొచ్చని స్వామిజీ చెప్పారని రోహిణి చెబుతుంది.

దాంతో శ్రుతి నవ్వుతుంది. అడుక్కుంటే కెనడా వెళ్తారా. మీనాను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకు. తనను నుంచి చాలా నేర్చుకనేది ఉంది. వాళ్లు ఎంత గొడవ పడిన వెంటనే కలిసిపోతారు అని శ్రుతి అంటారు. గొడవ పడకుండా ఎలా ఉండాలో చూసి నేర్చుకుంటే చాలు అని కోపంగా వెళ్లిపోతుంది రోహిణి. మరోవైపు మౌనికపై సంజు కోప్పడతాడు.

ప్రతీకారం మరియు సంఘర్షణ

సంతోషంగా ఉన్నానండి. మీరేగా సంతోషంగా ఉండమన్నారు అని భర్తపై పంచులు వేస్తుంది మౌనిక. దాంతో సోఫాను తంతాడు సంజు. మౌనిక కంగారుపడితే నాకేం కాలేదని సంజు అంటాడు. అంటే, సోఫా అని మళ్లీ కౌంటర్ వేస్తుంది మౌనిక. నేను చెప్పానని సంతోషంగా ఉన్నావా. బాలుకు ఏమైనా చేసి సంతోషంగా ఉండమంటే ఉంటావా అని సంజు అంటాడు.

మనిషిగా ఉండమని చెబితే ఎందుకు ఇలా అంటారు అని మౌనిక అంటే సంజు కొడతాడు. నేను ఏం చెబితే అది చేయాలి. రేపు మీ నాన్న అనారోగ్యంతో చచ్చిపోయినా నేను నవ్వమంటే నవ్వాలి అని సంజు కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు రవికి కూడా మనోజ్ అడుక్కున్న విషయం బాలు చెబుతాడు. ఇంతలో రవికి శ్రుతి కాల్ చేసి వెంటనే రమ్మంటుంది. దాంతో రవి వెళ్లిపోతాడు.

మనోజ్‌ కూడా రోహిణి కాల్ చేస్తే వెళ్లిపోతాడు. మరి నా పెళ్లాం ఎందుకు ఫోన్ చేయలేదు అని మీనాకే బాలు ఫోన్ చేసి నాకెందుకు చేయలేదు. నా గురించి నీకు పట్టింపు లేదా. నీకు నేనంటే బాగా అలుసు అయింది. నువ్ నన్ను ఫోన్ చేసి పిలవాలి అని బాలు అంటాడు. దాంతో మీనా అలాగే చేస్తుంది. మీరు వాళ్లలా మారకండి. మీలా ఉంటేనే నాకు ఇష్టం అని మీనా అంటుంది.

నువ్ నా బంగారు పూలగంపవే అని బాలు అంటాడు. దాంతో మీనా ముసిముసినవ్వుతుంది. తర్వాత శ్రుతి వచ్చి మల్లెపూలు తీసుకుని చేతికి కట్టుకుని వెళ్లిపోతుంది. అది చూసి ప్రభావతి భయపడుతుంది. అక్కడితే నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లోని సంఘర్షణలు మరియు ప్రతీకారాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.