|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్‌: మౌనిక‌కు అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టిన సంజు – రౌడీగా మీనాపై ముద్ర – బాలు విశ్వ‌రూపం

Published: 29-05-2025, 12:03 AM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్‌: మౌనిక‌కు అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టిన సంజు - రౌడీగా మీనాపై ముద్ర - బాలు విశ్వ‌రూపం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో అనేక ఉద్రేకభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. మనోజ్‌ అప్పుల బాధ్యత రోహిణిపై పడుతుండగా, మీనా గుణతో శివ యొక్క సంబంధంపై ఆందోళన చెందుతుంది. సంజు మౌనికను అవమానించడం, సువర్ణ జోక్యం చేసుకోవడం వంటివి ఈ ఎపిసోడ్‌లోని ముఖ్య సంఘటనలు.

Key Points

1

మనోజ్ అప్పుల బాధ్యత రోహిణిపై పడుతుంది.

2

మీనా, గుణ ప్రమాదకరమైన సంబంధాన్ని గుర్తిస్తుంది.

4

సువర్ణ, సంజును అడ్డుకుంటుంది.

మనోజ్‌ అప్పుల సమస్య

మ‌నోజ్‌కు ఇచ్చిన అప్పు కోసం అత‌డిని వెతుక్కుంటూ ఇంటికొస్తాడు స్నేహితుడు. ఫ్రెండ్‌ను చూడ‌గానే మ‌నోజ్ షాక‌వుతాడు. అత‌డిని ఇంటి నుంచి పంపించేందుకు తిప్ప‌లు ప‌డ‌తాడు. కానీ మ‌నోజ్ అప్పు సంగ‌తి అత‌డు రోహిణికి చెబుతాడు. మ‌నోజ్ చేసిన అప్పును రోహిణినే తీర్చాల‌ని అంటాడు.

మ‌నోజ్ బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టి వెళ‌తాడు. అంద‌రిద‌గ్గ‌రా అప్పులు చేయ‌డం ఏంటి? మ‌న మ‌ధ్య దాప‌రికాలు ఉండ‌కూద‌ని అనుకున్నాం క‌దా…ఎందుకు న‌న్ను మోసం చేస్తున్నావ‌ని భ‌ర్త‌ను కోప్ప‌డుతుంది రోహిణి .

గుణ ద‌గ్గ‌ర‌కు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది మీనా. గుణ‌తో చేరిన‌ప్ప‌టి నుంచి శివ చెడు వ్య‌వ‌సాల‌కు అల‌వాటు అయ్యాడ‌ని, అందుకే త‌మ్ముడిని బాలు కొట్టి ఉంటాడ‌ని సుమ‌తితో అంటుంది మీనా. గుణ‌ను కూడా క‌ల‌వొద్ద‌ని శివ‌కు గ‌ట్టిగా చెప్పాల‌ని అనుకుంటుంది. మ‌నం చెబితే మాట వినే స్టేజ్ శివ దాటిపోయాడ‌ని సుమ‌తి అంటుంది. గుణ చాలా ప్ర‌మాద‌క‌రం అని, ఏదో ఒక నేరం చేసి శివ‌ను అందులో ఇరికించినా ఇరికిస్తాడ‌ని మీనా భ‌య‌ప‌డుతుంది. ఆ లోపే శివ‌ను గుణ నుంచి దూరం చేసేలా చూడ‌మ‌ని సుమ‌తికి చెబుతుంది.

ఇంట్లో నుంచి మౌనిక‌ను పంపించ‌డానికి కొత్త స్కెచ్ వేస్తాడు సంజు. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఇంట్లో మందు పార్టీ ఏర్పాటుచేస్తాడు. త‌న ఫ్రెండ్స్‌కు మందు స‌ర్వ్ చేయ‌మ‌ని అంటాడు. సంజు మాట‌ల‌తో మౌనిక షాక‌వుతుంది. అత‌డు చెప్పిన‌ట్లే చేస్తుంది. మౌనిక‌ను ప‌నిమ‌నిషి అనుకుంటారు సంజు. ప‌నిమ‌నిషికి అందంతో పాటు పొగ‌రు ఎక్కువే అని అంటారు. కారులో ఇంకో మందు బాటిల్ ఉంది అది తీసుకుర‌మ్మ‌ని మౌనిక‌కు ఆర్డ‌ర్ వేస్తాడు సంజు. ఆ బాటిల్ తీసుకొని వ‌స్తుండ‌గా…మౌనిక కింద‌ప‌డ‌బోతుంది.

డ్రైవ‌ర్ ఆమెను ప‌డ‌కుండా ప‌ట్టుకుంటాడు. మౌనిక కు డ్రైవ‌ర్‌తో అక్ర‌మ‌ సంబంధం అంట‌గ‌డ‌తాడు సంజు. ఆమెను అవ‌మానిస్తాడు. మా అన్న‌య్య‌పై కోపంతో నాపై ఇలాంటి నింద‌లు వేసి హింసించ‌వ‌ద్ద‌ని భ‌ర్త‌ను బ‌తిమిలాడుతుంది మౌనిక‌. నీ గ‌తం గురించి మొత్తం తెలుసున‌ని సంజు అంటాడు. ఇంట‌ర్ నుంచి ఆఫీస్ వ‌ర‌కు బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూనే ఉన్నావ‌ని నాకు తెలుసున‌ని త‌క్కువ చేసి మాట్లాడుతాడు.

మీనా యొక్క ఆందోళన

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన సువ‌ర్ణ‌…సంజు చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి పీకుతుంది. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే చంపేస్తాన‌ని అంటుంది. ఇది అస‌లు భార్యే కాద‌ని, డ్రైవ‌ర్‌తో అంటూ సంజు చెప్ప‌బోతాడు. అది మాట‌ల‌ను అడ్డుకుంటుంది సువ‌ర్ణ‌. నువ్వు ఇలాగే చేస్తే మౌనిక ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ని అంటుంది. నాకు కావాల్సింది అదే అని సంజు మ‌న‌సులో అనుకుంటాడు.

పూల కొట్టును మూసేసి ఉండ‌టంతో ఏమైంది, ఎక్క‌డికి వెళ్లావ‌ని కోడ‌లిని అడుగుతాడు స‌త్యం. బాలు కారు ఎందుకు అమ్మేశాడో రాజేష్‌ను అడిగి తెలుసుకోవ‌డానికి వెళ్లాన‌ని మీనా అంటుంది. జ‌రిగింది తెలిసిన త‌ర్వాత నా దృష్టిలో బాలు విలువ వంద రెట్లు పెరిగింద‌ని మీనా అంటుంది. జ‌రిగింది ఏమిటో స‌త్యానికి చెబుతుంది. గుణ‌కు త‌న‌తో జ‌రిగిన గొడ‌వ వ‌ల్ల మిగిలిన స్నేహితుల జీవ‌నాధారం పోకూడ‌ద‌ని కారు అమ్మేసి స్నేహితుల అప్పుల‌న్నీ బాలు తీర్చేశాడ‌ని మీనా అంటుంది.

అది నా కొడుకు అంటే గ‌ర్వంతో పొంగిపోతాడు స‌త్యం. ఎవ‌రికోస‌మో బాలు కారు అమ్మేశాడ‌ని మీకు కోపంగా లేదా స‌త్యాన్ని అడుగుతుంది మీనా. మంచి మీద కోపం తెచ్చుకొని చెడ్డ‌వాడిని అయిపోవ‌డం నాకు ఇష్టం లేద‌ని స‌త్యం బ‌దులిస్తాడు. నిజం తెలుసుకోకుండా అంద‌రూ ఆయ‌న్ని దోషిని చేసి గొడ‌వ చేశార‌ని మీనా బాధ‌ప‌డుతుంది. మంచివిష‌యాన్ని బాలు మ‌న ద‌గ్గ‌ర దాచ‌డంటే దాని వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండొచ్చ‌ని స‌త్యం అంటాడు.

మీరు కారు ఎందుకు అమ్మారో నాకు తెలిసిపోయింద‌ని బాలుతో మీనా అంటుంది. గుణ వ‌ల్లే కారు అమ్మారు క‌దా అని అంటుంది. మీ స్నేహితులు రోడ్డుపై ప‌డ‌కూడ‌ద‌ని గుణ ద‌గ్గ‌ర మీ స్నేహితులు చేసిన అప్పులు తీర్చేశారు క‌దా అని అంటుంది. మిమ్మ‌ల్ని కాళ్ల‌పై ప‌డ‌మ‌ని అన్న గుణ ద‌గ్గ‌ర‌కు వెళ్లి చెడామ‌డా తిట్టాన‌ని, ఇంకోసారి మీ జోలికి వ‌స్తే ఊరుకోన‌ని వార్నింగ్ ఇచ్చాన‌ని అంటాడు. వాడికి నాలుగు త‌గిలించాల‌ని వెళ్లాన‌ని అంటుంది. వాడి ద‌గ్గ‌ర‌కు ఎందుకు వెళ్లావ‌ని మీనాపై ఫైర్ అవుతాడు బాలు. రౌడీగా ముద్ర‌…

ఇప్ప‌టిదాక న‌న్ను మాత్ర‌మే రౌడీ, గుండా అన్నారు. ఇప్పుడు నిన్ను కూడా పిలుస్తార‌ని మీనాతో బాలు అంటాడు. శివ‌ను ఏం అన‌లేక గుణ తిట్టొచ్చావా…అది విని నేను నిన్ను అద్భుతం అని పొగుడుతాన‌ని అనుకున్నావా క్లాస్ ఇస్తాడు. నువ్వెమైనా క‌ర్త‌వ్యంలో విజ‌య‌శాంతి అనుకుంటున్నావా అని కోప్ప‌డుతాడు.

సంజు యొక్క కుట్రలు

ఏదో ఒక రోజు మీ త‌మ్ముడు మిమ్మ‌ల్ని రోడ్డుపై నిల‌బెడ‌తాడ‌ని, వాడు ఎలాంటి వాడో ఆ రోజు తెలుస్తుంద‌ని వెట‌కారంగా బ‌దులిస్తాడు.

మౌనిక కోసం ఇళ్లు మొత్తం వెతుకుతాడు సంజు. ఎక్క‌డ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింద‌ని సంబ‌ర‌డ‌ప‌తాడు. త‌మ ప్లాన్ స‌క్సెస్ అయ్యింద‌ని సంజు, నీల‌కంఠం సంబ‌ర‌ప‌డ‌తాడు. కొద్ది రోజుల్లోనే మ‌న స్టేట‌స్‌కు త‌గ్గ అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాన‌ని సంజుతో నీల‌కంఠం అంటాడు. బాలు మ‌న కాళ్లు ప‌ట్టుకొనే రోజు కోసం వెయిట్ చేస్తున్నాన‌ని సంజు అంటాడు. చెల్లి కోసం బాలు త‌ప్ప‌కుండా ఆ ప‌నిచేస్తాడ‌ని నీల‌కంఠం అంటాడు. మౌనిక పుట్టింటికి వెళ్లిపోయి ఉంటుంద‌ని అనుకుంటారు.

అప్పుడే సంజుకు ప్ర‌భావ‌తి ఫోన్ చేస్తుంది. మౌనిక‌తో మాట్లాడాల‌ని అనుకుంటే స్విఛాఫ్ అని వ‌స్తుంద‌ని, నీ ప‌క్క‌న ఉంటే ఫోనివ్వ‌మ‌ని అంటుంది. ప్ర‌భావ‌తి మాట‌ల‌తో మౌనిక పుట్టింటికి వెళ్ల‌లేద‌ని గ్ర‌హిస్తాడు సంజు. మ‌నం పెట్టిన టార్చ‌ర్ వ‌ల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాన‌ని మౌనిక లెట‌ర్ రాసిన‌ ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా ఇబ్బందుల్లో ప‌డ‌తామ‌ని కొడుతుతో అంటాడు సంజు. మ‌నం టెన్ష‌న్ పెట్టాల‌ని అనుకుంటే మ‌న‌ల్ని తిరిగి టెన్ష‌న్ పెడుతుంద‌ని మౌనిక‌పై కోపంతో ర‌గిలిపోతాడు సంజు.

మౌనికను వెత‌క‌డానికి బ‌య‌ట‌కు వెళ‌తాడు. మౌనిక కోసం సంజు వెత‌క‌డం బాలు చూస్తాడు. కోపంగా సంజు ఇంటికి వ‌స్తాడు. నా చెల్లెలు ఎక్క‌డో చెప్ప‌మ‌ని అత‌డి మెడ‌పై క‌త్తి పెట్టి బెదిరిస్తాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

ఈ ఎపిసోడ్ లోని సంఘటనలు కథానాయికల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాలి. అన్ని పాత్రల మధ్య సంఘర్షణలు మరింత ఉద్రేకకరంగా మారనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.