|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: మనోజ్‌కు షాక్ ఇచ్చిన ముఖేష్! బాలు మాస్ ప్లాన్ తో రచ్చ రచ్చ!

Published: 23-03-2026, 12:05 AM
గుండె నిండా గుడి గంటలు: మనోజ్‌కు షాక్ ఇచ్చిన ముఖేష్! బాలు మాస్ ప్లాన్ తో రచ్చ రచ్చ!
  • గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్‌ను ఆడుకున్న బాలు, రవి.
  • ముఖేష్ నిజం తెలుసుకొని మనోజ్‌కు డీలర్‌షిప్ రద్దు చేస్తాడని అనుకుంటే తిరిగి ఇచ్చాడు.
  • బాలు ఫోన్ దొంగిలించిన రోహిణి, మరో ప్లాన్ వేస్తుంది.
  • గణ చేతికి శివ వీడియో, ఏం జరుగుతుందో చూడాలి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్! మనోజ్ ఆడిన నాటకానికి ముఖేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు? బాలు ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే!

మనోజ్‌కు ముఖేష్ షాక్!

Gunde Ninda Gudi Gantalu Serial March 23rd Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 23 ఎపిసోడ్‌లో మనోజ్ ఆడిన డ్రామా గురించి, ముఖేష్ చెప్పింది అంతా చెబుతాడు బాలు. ఇంటికొచ్చిన ముఖేష్ ముందు మనోజ్‌ను తిట్టి, బాలు, సత్యంను మెచ్చుకుంటాడు. వాళ్లకోసమే మనోజ్‌కు తిరిగి మళ్లీ డీలర్‌షిప్ ఇస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ముంబై ముఖేష్‌తో చాలా మాట్లాడాం, అంతా నిజం చెప్పేసాం కదా అని బాలు, రవి అంటారు. నువ్వు ఆడించిన నాటకం మొత్తం చెప్పేశామని రవి అంటాడు. నాటకం ఏంట్రా, ఎందుకు అంత కంగారుపడుతున్నారని సత్యం నిలదీస్తాడు.

బాలు కాలర్ పట్టుకుని నన్ను నిలువునా ముంచావు కదరా అని మనోజ్ అంటాడు. జెంటిల్ మెన్ అడిగితే చెప్పాలని నువ్వే అన్నావుగారా అని బాలు అంటాడు. అవును, నువ్వు చెప్పమంటేనే చెప్పాడు అని రవి అంటాడు. మరి నిజం తెలిసి కూడా అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి వెళ్లిపోయాడేంటీ అని రోహిణి అంటుంది. దాంతో అగ్రిమెంట్ పేపర్‌ను సరిగ్గా చూస్తాడు మనోజ్.

ఏదైనా ఫ్రాడ్ జరిగి డీల్ క్యాన్సిల్ చేస్తే నేను వాళ్లకు రూ. 50 లక్షలు ఇవ్వాలని రాసి ఉంది. నిలువెల్లా నష్టపోయాను బాధతో అంటాడు మనోజ్. దాంతో అంతా షాక్ అవుతారు. రేయ్.. అందుకే తాగి ఉన్నప్పుడు ఎందుకురా. తర్వాత తీరిగ్గా చదివి సంతకం పెట్టరా అంటే.. జెంటిల్ మెన్ జెంటిల్ మెన్ అన్నావని బాలు అంటాడు. బాలును, రోహిణి, ప్రభావతి అంటే.. సత్యం అడ్డుపడతాడు.

బాలు మాస్టర్ ప్లాన్ తో రచ్చ!

కోట్ విప్పేసి వెళ్లిపోతాడు. అదే ఛాన్స్ అనుకున్న రోహిణి కోట్‌లో నుంచి బాలు ఫోన్ తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. మరోవైపు హాల్లో ప్రభావతి టెన్షన్ పడితే సత్యం ఓదారుస్తాడు. నా ఇంటికి శనిలా దాపురించావని, నువ్వు బయటకు వెళ్లినప్పుడే ఇల్లు బాగుపడుతుందని బాలును తిడుతుంది ప్రభావతి. ఇంతలో ముంబై ముఖేష్ సత్యం ఇంటికి వస్తాడు.

అబద్ధాలు చెప్పిన ఫ్రాడ్ ఎక్కడ అని అడుగుతాడు. ప్రభావతి వెళ్లి మనోజ్‌ను పిలుచుకు వచ్చేందుకు వెళ్తుంది. సర్ నాకు ఇదంతా నాకు తెలియదు. లేకుంటే అప్పుడే వద్దనేవాన్ని. మాకు ఉంది ఇంతే ఆస్తి. మీకు ఏదైనా ఎక్కువ చేసి చెప్పుంటే నేను క్షమించమని అడుగుతున్నాను అని సత్యం అంటాడు. మీ సంజాయిషీ కోసం రాలేదని ముఖేష్ అంటాడు.

మిమ్మల్ని మోసం చేయాలని కాదు, తొందరగా ఎదగాలని ఆశతో చేశాడు. 50 లక్షలు కట్టే పరిస్థితి వాడికి లేదు. నేను నిజం చెప్పినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. వాడికి చాలా డిగ్రీలు ఉన్నా కలిసిరావడంలేదు. అందుకే నేను కూడా అబద్ధం ఆడాను. కానీ, మా నాన్న పెంపకం నిజం చెప్పించింది. నిజం చెబితే వాడికి ఏమవుతుందో ఆలోచించిక చెప్పాను. క్షమించండి సర్ అని బాలు చేతులెత్తి మొక్కుతాడు.

గణ చేతికి శివ వీడియో!

దాంతో బాలు భుజంపై చేయి వేసి మెచ్చుకుంటాడు ముంబై ముఖేష్. సత్యమేవ జయతే, సత్యం ఎల్లప్పుడు జయిస్తుంది. ఇదంతా మీ నాన్న పెంపకం గొప్పతనం. నేను మీకే క్షమాపణ చెబుతున్నాను. మీ పెంపకం బాగుంది. కానీ, అందరు కొడుకులు పాటించాలని రూల్ లేదు. కానీ, బాలు మాత్రం మీ మాట నిలబెడతాడు. మీ ఆశయాలు పాటిస్తాడు అని గొప్పగా చెబుతాడు ముఖేష్.

ఈ అగ్రిమెంట్ పట్టుకుని నేను కోర్టుకు వెళ్లొచ్చు అని చెప్పిన ముఖేష్.. కానీ నేను వెళ్లట్లేదు. కుటుంబంలో ఒక్కరు పట్టాలు తప్పితే అంతా నాశనం అవుతుంది. అందుకే నీకు డీలర్‌షిప్ ఇస్తున్నాను. ఈ అగ్రిమెంట్ చింపేస్తున్నాను అని చింపేస్తాడు. కొత్త డీల్‌కు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే మనోజ్ సంతకం చేస్తాడు. మీరు నిజంగా దేవుడు అని సత్యం అంటాడు.

తర్వాత ఇందాకా మా ఆయన్ను ఏదో అన్నారు. ఇప్పుడు ఏమంటారు అని మీనా అంటే.. నేను చచ్చినా వాడు మారడు అని వెళ్లిపోతుంది. దాంతో బాలు చిన్నబుచ్చుకుంటాడు. కిచెన్‌లో బాలు, మీనా మాట్లాడుకుంటారు. కడుపులో ఏది దాచుకోరు అని మీనా అంటుంది. మంచి జరుగుతుంది అంటే కొన్ని దాస్తాను. ఒకటి దాచాను. నీ క్షేమం కోసమే దాచాను అని బాలు అని బయటకు వెళ్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మనోజ్ భవిష్యత్తు ఏమిటో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.