|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: మీనా విశ్వరూపం! డైమండ్ రింగ్‌తో శ్రుతికి షాక్ ఇచ్చిన రవి!

Published: 11-03-2026, 2:05 AM
గుండె నిండా గుడి గంటలు: మీనా విశ్వరూపం! డైమండ్ రింగ్‌తో శ్రుతికి షాక్ ఇచ్చిన రవి!
  • మీనా కొడుతుంటే డైనింగ్ టేబుల్ కింద దాక్కున్న ప్రభావతి, రోహిణికి కూడా బెల్టుతో దెబ్బలు!
  • డైమండ్ రింగ్‌తో శ్రుతికి రవి ప్రపోజ్.. మనోజ్‌ను చూసి నవ్వుకుంటున్న మీనా, బాలు!
  • నిద్రమాత్రలతో బాలుపై రోహిణి ప్లాన్.. కారణం అడగమని ప్రభావతి సలహా!
  • మీనా నవ్వుతో చంపేస్తుందని బాలు కామెడీ.. సత్యం రాకతో మరింత ఉత్కంఠ!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్! మీనా ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డైమండ్ రింగ్ ప్రపోజల్‌తో శ్రుతి సంతోషంలో మునిగిపోయింది. ఈ ఎపిసోడ్ ఒక సంచలనం సృష్టించబోతోంది.

మీనా దెయ్యంలా మారిందా? అసలేం జరిగింది?

Gunde Ninda Gudi Gantalu Serial March 11th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 11 ఎపిసోడ్‌లో మనోజ్‌ను మీనా కొడుతుండగా.. రోహిణి వచ్చి అంటుంది. దాంతో రోహిణిని కూడా బెల్టుతో కొడుతుంది మీనా. మరోవైపు శ్రుతి దగ్గరికి వెళ్లిన రవి డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేస్తాడు. బాలుపై రోహిణి కొత్త ప్లాన్ వేస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పూలు అమ్ముకునేవాళ్లు అంటే ఆఫ్ట్రాలా అంటూ మనోజ్‌ను బెల్టుతో బాదుతుంది. అది చూసి భయపడిన ప్రభావతి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఇంతలో రోహిణి వస్తే కొడుతుందని మనోజ్ చెబుతాడు.

నాకు ఇంకో పని లేదా. నీకు, నీ మొగుడుకి ఆ తైతక్కలాడే ముసలి అత్తకు నేను పని మనిషిలా కనిపిస్తున్నానా. నువ్వు చేసి పెట్టవే నీ మొగుడుకి సూపు అని రోహిణిని కూడా బెల్టుతో కొడుతుంది మీనా. మొగుడు పెళ్లాలను ఇద్దరిని చితక్కొడుతుంది మీనా. బర్రె మొహం అంటూ మనోజ్‌ను తెగ తిడుతుంది. ప్లీజ్ దండం పెడతాను అని కింద కూర్చుని దండం పెడుతుంది రోహిణి.

ఇంకోసారి నన్ను చులకనగా చూస్తారా అని అడిగితే లేదని మనోజ్, రోహిణి చెబుతారు. ఇక మిగిలింది అత్తావతి. ఏయ్.. బయటకు రా.. నేను చేసేది చచ్చేదాకా మర్చిపోవు అని అత్తను పిలుస్తుంది మీనా. ఏంటీ ఇందాక ఏదో అన్నావ్ చెప్పు అని గద్దించిన మీనా బెల్టుతో కొట్టబోతుంది. దానికి ప్రభావతి గట్టిగా అరుస్తుంది. దాంతో మీనా తేరుకుని ఇదంతా నా కల అని నవ్వుతుంది.

డైమండ్ రింగ్‌తో రవి ప్రపోజల్.. శ్రుతి రియాక్షన్ ఏంటి?

నీ నవ్వు బాగుంది. ఇంతలా నువ్వు నవ్వలేదని బాలు అంటాడు. దాంతో మీనా నిజం చెబుతుంది. దానికి బాలు కూడా తెగ నవ్వుతాడు. అప్పుడు నేను ఉంటే బాగుండేదని బాలు అంటాడు. బయట సత్యం బాలు, మీనా నవ్వులు విని సంతోషిస్తాడు. ఇంట్లోకి వచ్చి అడుగుతాడు. మీనా నవ్వుతో చంపేస్తుందని బాలు అంటాడు.

ప్రభావతి, మనోజ్, రోహిణి మాకు మండిపోతుందని అంటే.. బెల్టు వల్లా అని మీనా పంచ్ వేస్తుంది. మళ్లీ ఇద్దరు నవ్వుతారు. మీనా ఎలా చిరునవ్వుతో మొదలుపెట్టి ముసిముసి, వెకిలి, పడిపడి నవ్వుతుందని అచ్చం మీనాలాగే ఇమిటేట్ చేస్తుంది ప్రభావతి. కారణం అడగమని ప్రభావతి అంటే.. అడగను. చాలా కాలం తర్వాత నా కోడలు గలగలా నవ్వుతుందని, మిమ్మల్ని ఆటాడుకుంటోందని, బాగా నవ్వుకోండ్రా అని చెప్పేసి వెళ్లిపోతాడు సత్యం .

ఇంతలో రవి వచ్చి శ్రుతి గురించి అడుగుతాడు. ఏంటీ సమస్య అని సురేంద్ర అడిగితే.. ముందు శ్రుతితో మాట్లాడాలని లోపలికి వెళ్తాడు. ఇప్పుడెలా ఉందని శ్రుతిని రవి అడుగుతాడు. శ్రుతి కోప్పడుతుంది. నేను చేసింది తప్పే, త్వరగా వద్దామనుకున్నా కానీ కుదర్లేదు. తప్పైపోయింది. క్షమించు అని రవి వేడుకుంటాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా అని శ్రుతి అంటుంది.

ఇంటికి రమ్మని రవి అడిగితే.. రానని శ్రుతి వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరగమని మోకాళ్లపై కూర్చుంటాడు రవి. శ్రుతి వెనక్కి తిరిగి చూస్తుంది. రవి చేతిలో ఉన్న డైమండ్ రింగ్ చూసి ఆశ్చర్యపోతుంది. తీసుకుని ఇదేంటని అడుగుతుంది. పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పాగా, అది సక్సెస్ కావడంతో మా బాస్ బోనస్ ఇచ్చింది. దాంతో కొన్నాను అని రవి చెబుతాడు.

బాలుపై రోహిణి ప్లాన్.. సత్యం ఏం చేశాడంటే?

మన కూతురను నమ్ముకుని మాస్టర్ ప్లాన్ వేస్తే ఫెయిల్ అయిందని సురేంద్ర అంటాడు. మరోవైపు షాపులో ఎంత అమ్మామో లెక్కలు వేసుకుంటారు మనోజ్, రోహిణి. రోహిణికి కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. బాలు దగ్గర వీడియో సంపాదించావా అని విద్య అడుగుతుంది. లేదని రోహిణి చెబుతుంది. దినేష్ గురించి ఇద్దరు భయపడతారు.

వీడియో సంపాదించడానికి ఓ ఐడియా వేశాను. బాలు రాత్రి పడుకునేముందు పాలల్లో అని రోహిణి చెబుతుంటే.. కొంపదీసి విషం కలుపుతావేంటీ అని విద్య అంటుంది. యే.. కాదు.. ఆ పాలల్లో నిద్రమాత్రలు కలుపుతాను. అప్పుడు ఫుల్‌గా నిద్రపోతాడు. నేను వీడియో తీసుకుంటాను అని రోహిణి చెబుతుంది. డోస్ ఎక్కువైతే ప్రమాదం, జాగ్రత్త అని విద్య చెబుతుంది.

మనోజ్ కన్నా రవిగాడు చాలా బెటర్, కాకపోతే నైటీ వేసుకుంటాడు అని బాలు అంటాడు. దాంతో గొంతు పిసికేస్తా అని రవి అంటాడు. నన్ను అడిగి వెళ్లావా. అడిగి వచ్చావా అని ప్రభావతి అంటే.. అందుకే అడగలేదని శ్రుతి బిరుసుగా సమాధానం ఇస్తుంది. తల్లికి సపోర్ట్ చేస్తూ బాలు మాట్లాడుతాడు. శ్రుతికి అంతా నచ్చ జెప్పాలని చూస్తారు.

ఇది నా ఫ్యామిలీ. అందుకే ఇక్కడ జరిగింది ఏది మా వాళ్లకు చెప్పలేదు అని శ్రుతి అంటుంది. దాంతో రిలాక్స్ అవుతాడు సత్యం. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. మీనా నవ్వులు, రోహిణి ప్లాన్స్, శ్రుతి ప్రపోజల్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.