|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఉస్తాద్’లో రాజకీయాలకు తావు లేదు! హరీష్ శంకర్ సంచలన ప్రకటన!

Published: 23-02-2026, 10:35 AM
‘ఉస్తాద్’లో రాజకీయాలకు తావు లేదు! హరీష్ శంకర్ సంచలన ప్రకటన!
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది.
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది.
  • సినిమాలో రాజకీయ విమర్శలు, ఎటకారపు ధోరణి ఉండదని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.
  • పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలా పాటలు రూపొందించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం 2026 మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా పొలిటికల్ సెటైర్ ఉండదని, కేవలం వినోదం మాత్రమే ఉంటుందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.

‘ఉస్తాద్’పై హరీష్ శంకర్ క్లారిటీ

Harish Shankar: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకోగా, రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో దర్శకుడు హరీష్ శంకర్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. సినిమాలో ఉన్న విషయంపై తాజాగా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏ పొలిటికల్ పార్టీ‌ని విమర్శించడం కానీ, ఎవరిపైనో సెటైర్స్ వేయడం కానీ ఉండవని చెప్పారు. ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదనీ, పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రేక్షకుడికి ఇచ్చేలానే ఈ సినిమా ఉంటుందని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన వీడియోలో..

‘‘హాయ్ గైస్.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’‌ (AURA OF USTAAD)కు ఇంతటి ట్రెమండస్ రెస్పాన్స్‌ను అందించిన అందరికీ థ్యాంక్యూ సో మచ్. చాలా మంది ‘మొత్తని మట్టి’, ‘బండరాళ్లను బద్దలు కొట్టే’ లిరిక్స్‌కు ఎడిట్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈ స్పందనకు థ్యాంక్స్ ఎ లాట్. ఓ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, పాట రిథమ్ మొదలైనప్పటి నుంచి.. మేమంతా పవన్ కళ్యాణ్ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాం. కాబట్టి.. ఇంతకు ముందు సాంగ్‌కు మీరు డ్యాన్స్ బస్టర్ అని పెట్టారు కదా.. ఈ సాంగ్‌కు ట్రాన్స్‌బస్టర్ అని పెట్టండి అని కోరాడు. ఇది చాలా మంచి ఐడియా అనిపించింది.

రాజకీయ విమర్శలు ఉండవని ప్రకటన

ఈ పాట పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, పర్సనల్ యాటిట్యూడ్‌కి దగ్గరగా ఉండటంతో.. చాలా మంది ఏం అడుగుతున్నారంటే.. ‘అన్నా.. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్, రిఫరెన్స్‌లు ఉంటాయా?’ అని అడుగుతున్నారు. ఈ విషయంలో వాళ్లందరికీ క్లియర్‌గా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే.. ఈ సినిమా మొదలైన డే 1 నుంచి పవర్ స్టార్ ఒక్కటే చెబుతున్నారు. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అని చెబుతూ ఆయన కూడా అదే ఫాలో అవుతున్నారు. అందుకే సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నా సరే, ‘వకీల్ సాబ్’, ‘ఓజీ’ సినిమాలలో ప్రకాశ్ రాజ్‌తో కలిసి యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారంటే.. ఆయన పాలసీ పరమైన పోరాటం తప్ప.. పర్సనల్ అటాక్ ఎప్పుడూ చేయరు. అందుకే, ఆయన డే 1 నుంచి చెబుతూనే ఉన్నారు. ‘హరీష్ మన సినిమాలో ఒక పొలిటికల్ డైలాగ్ కానీ, ఒక సన్నివేశంకానీ లేదంటే ఒక రిఫరెన్స్ కానీ, ఏ ఒక్కరు చిన్నబుచ్చుకునేలా చేసినా, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రొవోక్ చేసినా.. సినిమాకు జస్టిఫికేషన్ ఉండదు. సినిమా నడవదు. సినిమా అంటే వినోదం. దానిపైనే ఉండాలి’ అని అన్నారు. గాజు గ్లాస్ డైలాగ్ ఉందంటే.. అది పగిలినా పదునెక్కుతుందని, మన హీరో ఎలివేషన్ తప్ప.. ఎవరిమీదనో సెటైరో, ఎటకారమో మాత్రం కాదు. ఇందులో ఇంకొకరిపై సెటైర్లు, ఎటకారాలు ఉండవు.

పాటలకు వస్తున్న స్పందనపై హరీష్ సంతోషం

దీనికి రీజన్ ఏంటంటే.. సింపుల్ థింగ్.. ఆయనకు అన్ని పార్టీలలో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు ఓట్లు ఎవరికి వేసినా, సినిమా అనగానే ఈయననే అభిమానిస్తారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే.. దీనికి నేను కూడా థ్రిల్ అయ్యాను. ఆయనలాగే ఆయన ఫ్యాన్స్ కూడా సేమ్ మాట చెబుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతూ.. అన్నా మనకి వద్దు.. పాలిటిక్స్ రిఫరెన్స్‌లు పెట్టొద్దు. మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. బ్లాస్ట్ అయిపోవాలి అని అంటున్నారు. నిజంగా వారందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నాను. నిజంగా పవర్ స్టార్‌ని ఫాలో అవడమంటే, ఆయన స్టైల్‌, శ్వాగ్‌ని ఫాలో అవడమే కాకుండా.. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో నేను చాలా థ్రిల్ అయ్యాను. కాబట్టి.. ప్రతి ఒక్కరూ, ఈ సినిమాకు వచ్చి, ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తినో, ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వర్గాన్నో.. చిన్నబుచ్చుకునేలాకానీ, కించపరిచేలా కానీ, ఎటకారపు ధోరణులుగానీ ఎక్కడా సినిమాలో ఉండవు. అందరూ ఎంజాయ్ చేయాలనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఏమాటకు ఆ మాట.. హీరోని ఎలివేట్ చేసే డైలాగ్స్‌కానీ, ఆయన పెర్ఫార్మెన్స్‌గానీ బద్దలైపోద్ది’’ అని చెప్పుకొచ్చారు.

హరీష్ శంకర్ చేసిన ఈ ప్రకటనతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. రాజకీయాలకు దూరంగా, పూర్తి వినోదాత్మకంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉండబోతోందని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.