|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నమ్రత శిరోద్కర్: మిస్ ఇండియా టు మహేష్ భార్యగా.. ఆమె ప్రయాణం!

Published: 22-01-2026, 2:05 AM
నమ్రత శిరోద్కర్: మిస్ ఇండియా టు మహేష్ భార్యగా.. ఆమె ప్రయాణం!
  • నమ్రత 1993లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నారు.
  • 1999లో ‘వంశీ’ చిత్రంలో మహేష్ బాబుతో నమ్రత కలిసి నటించారు.
  • 2005లో మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు దూరమయ్యారు.
  • నమ్రత, మహేష్ బాబు కలిసి మహేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కెరీర్ గురించి తెలుసుకుందాం. మిస్ ఇండియాగా గెలుపొంది, మహేష్‌ను వివాహం చేసుకున్నాక నటనకు దూరమయ్యారు. నేడు ఆమె బర్త్ డే స్పెషల్.

మిస్ ఇండియాగా నమ్రత శిరోద్కర్

HBD Namratha Sirodhkar : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలో ఆమెకు మంచి క్రేజ్ ను మాత్రం అందించలేదు. హీరో మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా మహేష్ సినిమా భాధ్యతలను, పిల్లలను చూసుకుంటుంది. నేడు నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, అలాగే మహేష్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఆమె కెరియర్ లో మర్చిపోలేని మెమోరీస్ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం..

మహేష్ బాబు భార్య అవ్వకముందే ఆమె ఒక సెలబ్రిటీ.. 1993లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న నమ్రత, ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1998లో ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఏం మోడల్ అయినా మిస్ ఇండియా అవ్వాలని అనుకుంటారు. నమ్రత అనుకోవడం మాత్రమే కాదు.. మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అది తన జీవితంలో మర్చిపోలేని మెమోరీ అని గతంలో ఓ సందర్భంలో బయటపెట్టింది..

మహేష్ బాబుతో ప్రేమ, వివాహం

1999 లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కలిసిన చిత్రం వంశీ.. మిస్ ఇండియా కిరీటం గెల్చుకోవడం, బాలీవుడ్‌లోనూ స్పెషల్ క్యారెక్టర్స్‌తో పేరు తెచ్చుకున్న నమృత.. అప్పుడప్పుడే టాలీవుడ్‌లో ఎదుగుతున్న మహేష్ బాబుతో కలిసి నటించించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ప్రతిరోజు కలవకపోయినా, ఫోన్లలో మాట్లాడలేక పోయినా వీరి మధ్య బంధం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా పెరిగింది. 2004 లో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు.. 2005 లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయ్యింది. కేవలం మహేష్ బాబు ప్రేమ కోసమే తన కెరీర్ ని వదులుకుంది.. ప్రస్తుతం హౌస్ వైఫ్ గా ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార..

మహేష్ బాబు తో కలిసి మహేష్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. ఎంతోమంది చిన్నారులకు మహేష్ బాబు ఫౌండేషన్ తరపున గుండె ఆపరేషన్లు చేయించారు. ఆయన చేసే ప్రతి ఒక్క సేవ కార్యక్రమాల్లో ముందుండి అన్ని చూసుకుంటుంది నమ్రత. భర్తకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అయితే ఈమధ్య నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎటువంటి క్లారిటీ రాలేదు.. దాంతో ఇవి కేవలం గాలివార్తలే అని మహేష్ అభిమానులు కొట్టి పడేశారు.

కుటుంబం, సేవా కార్యక్రమాలు

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాకు వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది..

నమ్రత శిరోద్కర్ తన జీవితాన్ని కుటుంబానికి, సమాజానికి అంకితం చేశారు. ఆమె మహేష్ బాబుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.