|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కంటతడి పెట్టిస్తున్న దృశ్యం! తల్లి కోసం ఎనిమిదేళ్ల బాలుడి పోరాటం!

Published: 02-04-2026, 4:05 AM
కంటతడి పెట్టిస్తున్న దృశ్యం! తల్లి కోసం ఎనిమిదేళ్ల బాలుడి పోరాటం!
  • ఎండలో స్పృహతప్పి పడిపోయిన తల్లిని చూసి చలించిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు.
  • నీళ్లు తెచ్చి తల్లికి తాగించి ఆమెను కాపాడేందుకు చిన్నారి ప్రయత్నం.
  • కాన్పూర్‍లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  • బాలుడి పోరాటానికి నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు.

కన్నతల్లి ఆపదలో ఉంటే ఓ చిన్నారి పడే ఆరాటం ఈ వీడియోలో చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‍లో ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అందరినీ కదిలిస్తోంది.

ఎండలో స్పృహ తప్పిన తల్లి

కన్న బిడ్డల ఆలనా పాలన కోసం తల్లి పడే ప్రయాసం మనందరికి తేలిసిందే. కానీ కన్నతల్లి ఆపదలో ఉంటే ఓ పసి ప్రాణం విలవిలలాడిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కలిచివేసేలా చేస్తోంది. మండుతున్న ఎండలో తన తల్లి స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల బాలుడు చేసిన పోరాటం అందరిని కంటతడిపెట్టేలా చేస్తోంది. యూపీలోని కాన్పూర్‍లో (Kanpur) జరిగినట్లుగా చెప్పబడుతున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. తీవ్రమైన వేడికి తట్టుకోలేక ఓ మహిళ రోడ్డుపైనే స్పృహతప్పి పడిపోయింది. అదే సమయంలో ఆమెతో పాటే ఉన్న ఎనిమిదేళ్ల కుమారుడు తన కళ్లముందే తల్లి పడిపోవడాన్ని చూసి తల్లడిల్లిపోయాడు.

ఏం చేయాలో పాలుపోక, అమ్మను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమెలో చలనం లేకపోవడంతో ప్రాణ సమానమైన అమ్మ కోసం ఆ చిన్నారి పోరాటమే చేశాడు. మండుటెండలో తన కాళ్లకు చెప్పులు లేకపోయినా పరుగు పరుగునా వెళ్లి బాటిల్ లో నీళ్లు తీసుకువచ్చి తన తల్లి చేత తాగించాడు. కొడుకు సపర్యలకు కోలుకున్న తల్లి లేని కూర్చుంది. తన తల్లికోసం చిన్నారి చేసిన ఈ పోరాటాన్ని స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తల్లి కోసం బాలుడి తపనను చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు.

నీళ్లు తెచ్చి సపర్యలు చేసిన బాలుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

తల్లిపై బాలుడికున్న ప్రేమ, అనుబంధం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తోంది. ఇలాంటి సంఘటనలు మనల్ని కదిలిస్తూనే ఉంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.