|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మలైకా అరోరాను అరెస్ట్ చేసిన పోలీసులు! అసలేం జరిగింది? ఫిట్‌నెస్‌తో చిక్కుల్లో పడ్డ హీరోయిన్!

Published: 01-02-2026, 7:35 AM
మలైకా అరోరాను అరెస్ట్ చేసిన పోలీసులు! అసలేం జరిగింది? ఫిట్‌నెస్‌తో చిక్కుల్లో పడ్డ హీరోయిన్!
  • మలైకా అరోరా ఫిట్‌నెస్‌పై పోలీసులు విచారణ చేయడం హాట్ టాపిక్ అయింది.
  • ఆమె అందం, ఫిట్‌నెస్‌ వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని ఆరోపణలు వచ్చాయి.
  • మలైకా తన ఫిట్‌నెస్ రహస్యాన్ని ‘ఇన్‌వోగ్ షేప్‌వేర్’ అని వెల్లడించింది.
  • ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఒక షేప్‌వేర్ ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె ఫిట్‌నెస్‌ కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు ఆమెను విచారిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రాఫిక్ జామ్‌కు కారణమైన మలైకా

Malaika Arora: ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఈ వీడియోలో 52 ఏళ్ల హీరోయిన్.. తను ఫిట్ గా ఉండటమే తను చేసిన తప్ప… తన షేప్స్ కరెక్ట్ గా ఉండడం తన తప్ప అని రకరకాలుగా అడగడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె వీడియో ఎందుకు ట్రెండింగ్ అవుతోంది అనే విషయాల్లోకి వెళ్తే…

ఆ హీరోయిన్ ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ Malaika Arora. వయసు పెరుగుతున్నా కూడా ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఎప్పుడూ రాజీ పడదు. యోగా, వ్యాయామం, హెల్తీ డైట్‌తో ఆమె తన లైఫ్‌స్టైల్‌ను క్రమశిక్షణగా కొనసాగిస్తోంది. అందుకే 50 దాటిన వయసులో కూడా ఆమె ఎంతో యంగ్‌గా కనిపిస్తుంది.

ఇటీవల మలైకా అరోరా నటించిన ఓ షేప్‌వేర్ యాడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాడ్‌ను సాధారణ ప్రకటనలా కాకుండా.. సినిమా స్టోరీలా చాలా ఆసక్తికరంగా రూపొందించారు. యాడ్ కథ పోలీస్ స్టేషన్‌తో ప్రారంభమవుతుంది. పోలీసులు మలైకాను ప్రశ్నిస్తారు. మీ వల్లే రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది..అంటూ ఆరోపణలు చేస్తారు. ముంబై సీ లింక్‌పై ట్రాఫిక్ ఆగిపోయిందని, పాపరాజీలు ఆమె వెంటే తిరుగుతున్నారని చెబుతారు.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజం

https://www.instagram.com/upscworldofficial/p/DUNjDZwEXmv/

ఈ ఆరోపణలకు మలైకా చాలా కూల్‌గా స్పందిస్తుంది. తాను ఏ తప్పు చేయలేదని చెబుతుంది. చివరికి ఓ సరదా ట్విస్ట్‌తో అసలు నిజాన్ని బయటపెడుతుంది. తన ఫిట్‌గా కనిపించే షేప్‌కు కారణమైన ఒక రహస్యాన్ని చాలా రోజులుగా దాచిపెట్టడమే తన నేరం అని.. అది మరేదో కాదు ఇన్‌వోగ్ షేప్‌వేర్ అని చెప్పుకొస్తుంది.

ఇదంతా చూసి ప్రేక్షకులు ఒకవైపు నవ్వుకుంటూ మరోవైపు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ అడ్వటైజ్మెంట్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఆమె బాగుందటమే ఆమె నేరమా అని వీళ్ళు కూడా తమాషాగా క్యాప్షన్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న మలైకా అరోరా యాడ్

మరి కొంతమంది అడ్వర్టైజ్మెంట్ తీసిన వారి క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా అడ్వటైజ్మెంట్ తీయవచ్చా అని హాస్యపదమైన పదాలు వాడి వాళ్లను పొగురుతున్నారు. మొత్తానికి ఈ అడ్వటైజ్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మొత్తానికి మలైకా అరోరా షేప్‌వేర్ ప్రకటన సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. ఆమె ఫిట్‌నెస్ రహస్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.