
📌 Key Points
- IMD హెచ్చరిక: 12 రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు
- మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు
- రాష్ట్రాలకు 3-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక
- వడగాల్పుల పట్ల ప్రజలకు IMD సూచనలు, జాగ్రత్తలు
భారత వాతావరణ శాఖ దేశంలోని 12 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నెలలోనే ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
12 రాష్ట్రాలకు IMD హీట్ వేవ్ హెచ్చరికలు
ఈ సంవత్సరం వర్షాలతో పాటు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు, చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి మొదటి వారంలోనే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరగనుందని, దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈసారి వడగాల్పుల (Heat Waves) తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎండల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించింది.
ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ సూచనలు
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లలు జాగ్రత్త వహించాలి.


