|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేషన్ షాపుల వద్ద జాతర! మూడు నెలల బియ్యం పంపిణీతో జనం పోటెత్తారు!

Published: 09-04-2026, 8:05 AM
రేషన్ షాపుల వద్ద జాతర! మూడు నెలల బియ్యం పంపిణీతో జనం పోటెత్తారు!
  • రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ.
  • ప్రతి కుటుంబానికి తలసరి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది.
  • రేషన్ షాపుల వద్ద భారీగా జనం రద్దీ, సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి.
  • ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి ఒకేసారి రేషన్ పంపిణీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది. దీనితో రేషన్ షాపుల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ పంపిణీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది.

ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం… మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. దీంతో తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద వరుసగా రెండో ఏడాది కూడా ముందస్తు సరఫరా జరగుతోంది.

సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు, దాదాపు 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద, ఆహార భద్రతా కార్డులు ఉన్న కుటుంబాలు తలసరి 6 కిలోల సన్న బియ్యం పొందుతున్నాయి.

మూడు నెలల బియ్యం ఒకేసారి అందిస్తుండటంతో రేషన్ షాపుల దగ్గరకు భారీగా జనాలు వస్తున్నారు. క్యూలైన్లలో చాలాసేపు నిల్చుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచే లైన్లు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డులతో పాటు బస్తాలను లైన్ లో ఉంచుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. రేషన్ కార్డు ఉన్న వారు ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉండటంతో… చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల వద్ద తెల్లవారుజాము నుంచే భారీగా లైన్లు దర్శనమిస్తున్నాయి.

రేషన్ షాపుల వద్ద భారీగా జనం రద్దీ

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ జరుగుతోంది. రేషన్ కార్డుదారులు భారీగా తరలివస్తుండగా… కొన్నిచోట్ల స్టాక్ సమస్యలు వస్తున్నాయి. దీంతో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

ఒకేసారి భారీగా సంఖ్యలో జనాలు వస్తుండగా…. సాంకేతికంగా సర్వర్‌ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈపోస్‌ యంత్రాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతున్నాయి. మళ్లీ రీస్టార్ట్ చేసి ప్రాసెస్ కూడా కూడా సమయం పడుతోంది. బయోమెట్రిక్‌ విషయంలో కూడా సమస్యలు వస్తుండటంతో… సరఫరా ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చే రేషన్ అయిపోతే… మరో మూడు నెలల పాటు ఇవ్వరనే ఆందోళనతో చాలా మంది ఒకేసారి వస్తున్నారు. అయితే నెలాఖరు వరకు పంపిణీ ఉంటుందనే విషయంపై అవగాహన లేకపోవటం కూడా కొంత సమస్యగా మారినట్లు కనిపిస్తోంది.

స్టాకు అయిపోయినప్పుడల్లా మళ్లీ వచ్చేవరకు షాపును మూసేస్తున్నారు. దీంతో వినియోగదారులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం తమకు అందక ముందే అయిపోతాయనే ఆందోళన చాలాచోట్ల లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. మరోవైపు వేసవి కావటంతో… చాలాచోట్ల వినియోగదారులు ఎండకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

ఇక ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందుతుందని స్పష్టం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు.

సాంకేతిక సమస్యలు, స్టాక్ కొరత

జవాబు: ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

జవాబు: బయోమెట్రిక్ లేదా వేలిముద్రలు పడనప్పుడు ఐరిస్ (కంటి గుర్తింపు) ద్వారా బియ్యం పొందే అవకాశం ఉంటుంది.

జవాబు: సాధారణ పనివేళల్లో నెలాఖరు వరకు పంపిణీ జరుగుతుంది. స్టాక్ అయిపోయిన చోట తిరిగి నిల్వలు వచ్చిన తర్వాత పంపిణీ కొనసాగుతుంది. రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ప్రస్తుతం రేషన్ పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నప్పటికీ, అధికారులు త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా సహకరించాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.