
📌 Key Points
- తెలంగాణలో బ్రాహ్మణుల కుటుంబాలలో కులాంతర వివాహాలు ఎక్కువ.
- బీసీ/ఎస్సీ క్రైస్తవులు, రాజులు కులాంతర వివాహాల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- వెలమ, రెడ్డి వంటి అగ్రవర్ణాలలో కులాంతర వివాహాల రేటు తక్కువగా ఉంది.
- పట్టణీకరణ, విద్య కులాంతర వివాహాలకు ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో కులాంతర వివాహాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్రాహ్మణులు కులాంతర వివాహాలు చేసుకోవడంలో ముందున్నారని సర్వే తేల్చింది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
సర్వేలో వెల్లడైన కులాంతర వివాహాల తీరు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కులాంతర వివాహాలు ఎక్కువగా చేసిన కుటుంబాలలో బ్రాహ్మణులు అత్యధికంగా ఉన్నారని తేలింది. ఆ తర్వాత బీసీ/ఎస్సీ క్రైస్తవులు, రాజులు ఉన్నారు.
కాపులు, బ్రాహ్మణులతోపాటు బీసీ-ఏలు కూడా కులాంతర వివాహాలలో ఎక్కువ వాటాతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ.. వెలమ, రెడ్డి వంటి అగ్రవర్ణాలు కులాంతర వివాహాల రేటును చాలా తక్కువగా కలిగి ఉన్నాయి. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ (ఐఈడబ్ల్యూజీ) తెలిపింది.
కులాంతర వివాహాలు సామాజిక అడ్డంకులను బలహీనపరుస్తాయి. పెరుగుతున్న సామాజిక చలనశీలతను సూచిస్తాయి, ముఖ్యంగా వ్యక్తిగత ఏజెన్సీ పరంగా, మహిళలు తమ భాగస్వాములను ఎన్నుకోవడంలో ఎక్కువ స్వేచ్ఛను ఉపయోగిస్తున్నారు.
అగ్రవర్ణాలలో తక్కువ కులాంతర వివాహాలు ఎందుకు?
కులాంతర వివాహాలతో బ్రాహ్మణులు అత్యధికంగా (12 శాతం), బీసీ-సీ, ఎస్సీ క్రైస్తవులు (9.9 శాతం), రాజులు (8.7 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అగ్రవర్ణాల్లో వధువుల కొరతతోనే కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసింది. కులాంతర వివాహాల ప్రాబల్యం సమాజం గురించి కూడా చర్చకు దారితీస్తోంది. అధిక పట్టణీకరణ, విద్య కూడా కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఓ కారణంగా ఉన్నాయి.
కులాంతర వివాహాలకు ఒక ముఖ్యమైన అంశం పట్టణ నివాసం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 90 శాతం మంది బ్రాహ్మణులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని వెల్లడైంది. దీంతో వివాహంలో కుల అడ్డంకులను పెద్దగా పట్టించుకోవడం లేదు.
మరోవైపు ఎస్టీ కోలాం(2.6 శాతం), బీసీ-డీ మాలి (2.6 శాతం), ఎస్టీ గోండులు (2.8 శాతం) వంటి కులాలు కులాంతర వివాహాలలో అతి తక్కువ వాటా కలిగి ఉన్నాయి. అయితే దీనికి కూడా పలు కారణాలు ఉన్నాయి. అందుకే కులాంతర వివాహాలకు సంబంధించి వీరు ప్రభావితం అవుతున్నారు. భౌగోళికంగా ఒంటరితనం, పట్టణాలకు దూరంగా ఉండటం, సాంప్రదాయ నిబంధనలకు కట్టుబడి ఉండటం దీనికి కారణమని తెలిపింది.
కులాంతర వివాహాలకు కారణాలు ఏమిటి?
రెడ్డీలు, వెలామాలతో సహా భూ యాజమాన్యంలోని ఫార్వర్డ్ కులాల మధ్య కులాంతర వివాహాల తక్కువగానే జరుగుతున్నాయి. ఆర్థిక పురోగతి, పట్టణీకరణ కొంతమందికి వివాహంలో కుల అడ్డంకులను తొలగిస్తున్నాయి. అయితే కొన్ని కులాల్లో లోతుగా పాతుకుపోయిన ఆలోచనలు, ఇతర కారణాలతో కులాంతర వివాహాలు చేసుకోవడం లేదు.
2024-25లో తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల (ఎస్ఈఈపీసీ) సర్వే-2024 నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15న ఈ నివేదికలను పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేసింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి, కులాంతర వివాహాల రేటులో మార్పులు సమాజంలో వస్తున్న మార్పులకు సూచనగా నిలుస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు రానున్న రోజుల్లో చర్చకు దారితీసే అవకాశం ఉంది.


