
రాజమౌళి-మహేష్ బాబు SSMB29 సినిమా టైటిల్‌ను నేడు ‘వారణాసి’గా ప్రకటించారు. రామోజీఫిల్మ్ సిటీలో జరిగిన ఈ భారీ ఈవెంట్‌లో దివంగత అందెశ్రీకి నివాళి అర్పించారు. రాజమౌళి, మహేష్ బాబు సహా ప్రముఖులు నిలబడి గౌరవించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Key Points
రాజమౌళి-మహేష్ బాబు SSMB29 సినిమా టైటిల్ 'వారణాసి' విడుదల.
రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌లో గ్లింప్స్ ఆవిష్కరణ.
దివంగత తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి ఘన నివాళి.
తెలంగాణ గీతం కోసం అందెశ్రీ, కీరవాణి కలిసి పనిచేశారు.
వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్
రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమా టైటిల్‌ను నేడు అనౌన్స్ చేశారు. రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి వారణాసి అనే టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను సైతం విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఇటీవల మరణించిన తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీకి నివాళి అర్పించారు.
ఈవెంట్ లో గ్లింప్స్ కోసం ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ పై అందెశ్రీ ఫోటోలను వేస్తూ బ్యాగ్రౌండ్ లో జయజయహే తెలంగాణ గీతాన్ని పాడారు. ఈ క్రమంలో రాజమౌళి, మహేశ్ బాబు సహా హాజరైన నటీనటులు, ఇతరులు నిలబడి అందెశ్రీకి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే జయజయహే గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చారు. అంతే కాకుండా వారణాసి సినిమాకు సైతం ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రగీతం కోసం సైతం అందెశ్రీ కీరవాణి కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
అందెశ్రీకి ఘన నివాళి
కీరవాణి సంగీత విశేషాలు
‘వారణాసి’ ఈవెంట్ కేవలం సినిమా ప్రకటనకే కాకుండా, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీని స్మరించుకోవడానికి ఒక వేదికగా మారింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


