
ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు చేరన్ ఆణిముత్యం ‘ఆటోగ్రాఫ్’ చిత్రం మళ్లీ నవంబర్ 14న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చేరన్ మాట్లాడుతూ, తాను కమర్షియల్ చిత్రాలు చేసి ఉంటే కనిపించకుండా పోయేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Key Points
చేరన్ దర్శకత్వంలో ఆటోగ్రాఫ్ చిత్రం 21 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్.
కమర్షియల్ చిత్రాలు చేసి ఉంటే కనిపించకుండా పోయేవాడినని చేరన్ వ్యాఖ్య.
చిత్ర నిడివి 15 నిమిషాలు తగ్గించి, డాల్బీ అట్మాస్‌తో విడుదల.
నవంబర్ 14న కొత్త డిజిటల్ ఫార్మెట్‌లో సినిమా విడుదల.
‘ఆటోగ్రాఫ్’ రీ-రిలీజ్‌కు సిద్ధం
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దర్శకుడు చేరన్ ( Cheran ). ఈయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ప్రజలకు ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. అలా ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ఆటోగ్రాఫ్ ( Autograph Movie ) అనే తమిళ చిత్రం ఒకటి. చేరన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై 21 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ ఇందులోని పాటలు చాలాచోట్ల వినిపిస్తూనే ఉంటాయి.
ఆ పని చసుంటే ఎదిగేవాడ్ని.. అలాంటి చిత్రం మళ్లీ డిజిటల్ ఫార్మెట్‌లో కొత్త హంగులతో నవంబర్ 14న విడుదల కానుంది. గురువారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేరన్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గం, ఇతర మిత్ర వర్గం పాల్గొని తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు అమీర్, ఆరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చేరన్ మాట్లాడుతూ.. తాను మంచి కమర్షియల్ చిత్రాలు చేసుంటే ఆర్థికంగా ఎదిగి ఉండేవాడినేమో.. కానీ, ఆ తరువాత కనిపించకుండా పోయేవాడినేమోనని అన్నారు.
చేరన్ సంచలన వ్యాఖ్యలు: కమర్షియల్ చిత్రాలపై
15 నిమిషాలు కట్ చేశాం ఈ ఆటోగ్రాఫ్ చిత్ర నిడివిని 15 నిమిషాలు తగ్గించినట్లు చెప్పారు. డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చామని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేసి తాను సాధించేదేమీ లేదన్నారు. అయితే నేటి తరం ఎలా ఉందన్నది తెలుసు.. కాబట్టి ఇప్పుడు వారు ఈ చిత్రాన్ని చూస్తే వేరే ఆలోచన కలగవచ్చన్నారు. తాము విత్తనం మాత్రమే నాటగలమని, ఆటోగ్రాఫ్ చిత్రానికి ఆ అర్హత ఉందని భావించి మళ్లీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఆధునిక హంగులతో మళ్లీ ఆటోగ్రాఫ్
‘ఆటోగ్రాఫ్’ వంటి చిత్రాలకు సమాజంలో విత్తనం నాటే శక్తి ఉంటుందని చేరన్ అభిప్రాయపడ్డారు. ఈ రీ-రిలీజ్ నేటి తరం ప్రేక్షకులకు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నారు.


