
📌 Key Points
- 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి యువ సంచలనంగా మారాడు.
- అతని వయస్సు కారణంగా ‘బాల కార్మిక’ వివాదం రేగింది, ఒక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు.
- 15 ఏళ్ల లోపు పిల్లలు ప్రొఫెషనల్ లీగ్‌లలో ఆడటం చట్టవిరుద్ధమని కార్యకర్త వాదన.
- రాజస్థాన్ రాయల్స్ చర్యలు తీసుకోకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక.
ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటపై ‘బాల కార్మిక’ వివాదం చెలరేగింది. 14 ఏళ్ల వయస్సులో అతను ఆడటం చట్టవిరుద్ధమని ఒక సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశం ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైభవ్ సూర్యవంశీ: ఐపీఎల్ యువ సంచలనం
14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2025 లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) యువ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 2026 సీజన్ ప్రారంభం నుంచి సంచనాలను సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో అతని కారణంగా ఐపీఎల్ కు ‘బాల కార్మిక’ సెగ తగిలింది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ (IPL) ఆడటంపై ఒక కన్నడ టీవీ ఛానల్ వేదికగా ఒక సామాజిక కార్యకర్త తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల వయసున్న పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం చైల్డ్ లేబర్ (Child labor) కిందకు వస్తుందని, అతడిని వెంటనే టోర్నీ నుంచి తొలగించి ఇంటికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం (Rajasthan Royalsowners) దీనిపై చర్యలు తీసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు యాక్టివిస్ట్ హెచ్చరించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యవంశీ వయసులో చిన్నవాడని, అతను క్రికెట్ ఆడే బదులు చదువుకోవాలని ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్ల బాలుడు ఇటువంటి భారీ ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడటం చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ విషయంలో ఈ రకమైన వివాదం రేగడం ఇప్పుడు క్రీడారంగంలో చర్చనీయాంశంగా మారింది.
‘బాల కార్మిక’ వివాదం: సామాజిక కార్యకర్త డిమాండ్
చట్టబద్ధతపై ప్రశ్నలు: ఐపీఎల్ నిబంధనలు
వైభవ్ సూర్యవంశీ విషయంలో తలెత్తిన ఈ ‘బాల కార్మిక’ వివాదం ఐపీఎల్ నిబంధనలు, బాలల హక్కులపై కొత్త చర్చకు దారితీసింది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందో వేచి చూడాలి.


