
📌 Key Points
- ట్రంప్ ప్రకటనలను ఇరాన్ నమ్మడం లేదు, ఇది ప్రపంచ దృష్టిని మళ్లించే కుట్ర అని ఆరోపించింది.
- అమెరికాతో చర్చలు జరగడం లేదని, దాడి చేయడానికి అమెరికా కుట్ర చేస్తోందని ఇరాన్ పేర్కొంది.
- యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయాయని, ట్రంప్ భయపడుతున్నారని ఇరాన్ తెలిపింది.
- ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో శాంతి కోసం ఐదు రోజుల యుద్ధ విరమణ ప్రకటనను ట్రంప్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనలను ఇరాన్ నమ్మడం లేదు. ఇది ప్రపంచ దృష్టిని మళ్లించే కుట్ర అని ఇరాన్ ఆరోపించింది.
ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసిన ఇరాన్
పశ్చిమాసియాలో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో భాగంగానే యుద్ధాన్ని ఐదు రోజుల నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టిపారేసింది. ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడంలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇరాన్ పేర్కొంది. ‘మా దాడులకు ట్రంప్ భయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడాయి. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదు. అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరుగడం లేదు. ట్రంప్ మళ్లీ ఏదో కుట్ర చేయడానికి శాంతి రాగం పాడుతున్నారు’ అని ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది.
కాగా, గతనెల 28వ తేదీ నుంచి కొనసాగుతోన్న యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభం దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై భూతల దాడులకు ఇరాన్ సిద్ధమవుతోందని నివేదికలు అందుతున్నాయి. ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటన చేశారు. అయితే, దీనిపై ఇరాన్ మాత్రం భిన్నంగా స్పందించడం గమనార్హం. అసలు ఎటువంటి చర్చలు జరగడం లేదని, ట్రంప్‌ను నమ్మలేమని ప్రకటన చేసింది.
అమెరికా కుట్ర చేస్తోందన్న ఇరాన్
యుద్ధం ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందా?
ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


