
📌 Key Points
- ఇస్రో ‘యువ విజ్ఞాని కార్యక్రమం’ ద్వారా విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ.
- 8వ తరగతి మార్కులు, క్విజ్‌లో ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక.
- ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, కోర్సు మెటీరియల్ ఇస్రో ద్వారా అందించబడుతుంది.
- సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో సైంటిస్టులతో నేరుగా మాట్లాడే అవకాశం.
ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం ‘యువ విజ్ఞాని కార్యక్రమం’ (యువికా)-2026ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంకేతికత మరియు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి కూడా కల్పిస్తారు.
యువ విజ్ఞాని కార్యక్రమం – 2026 వివరాలు
పాఠశాల పిల్లల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘యువ విజ్ఞాని కార్యక్రమ్’ (యువికా)-2026ను ఇస్రో నిర్వహిస్తోంది. యువ విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, వాటి అనువర్తనాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.
ఇస్రో యువికా 2026 2026 కోసం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివిధ అంశాల ఆధారంగా జరుగుతుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8వ తరగతి మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటే.. ఆన్‌లైన్ క్విజ్ కు 10 శాతం వెయిటేజీ ఇస్తారు. సైన్స్ ప్రదర్శనలు/కార్యక్రమాలను కూడా పరిశీలిస్తారు. గత మూడేళ్లలో పాల్గొన్న స్థాయిని బట్టి 2 నుంచి 10 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఎంపిక విధానం మరియు వెయిటేజీ
ఒలింపియాడ్స్, క్రీడలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC లేదా NSSలో సాధించిన విజయాలకు అదనపు మార్కులు ఉంటాయి. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయా విద్యార్థులకు అదనంగా 15 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస ప్రాతినిధ్యం ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ ఇస్రో యువికా 2026 శిక్షణా కార్యక్రమం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ వంటి తొమ్మిది ప్రధాన ఇస్రో కేంద్రాల్లో జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంపికైన విద్యార్థుల కోర్సు మెటీరియల్, వసతి, భోజన ఖర్చులన్నింటినీ ఇస్రోయే చూసుకుంటుంది.
శిక్షణ మరియు ప్రయోజనాలు
ఇందులో ఎంపికయ్యే విద్యార్థులు…. ఇస్రో సైంటిస్టులతో డైరెక్ట్ ఇంటారాక్షన్, ల్యాబ్ విజిట్‌లు, స్పేస్ టెక్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్‌లో కెరీర్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పొచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భావి శాస్త్రవేత్తలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఇస్రో అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం.


