
📌 Key Points
- జగపతిబాబు ‘పెద్ది’ సినిమాలో అప్పల సూరిగా కనిపించనున్నారు.
- అప్పల సూరి గెటప్‌లో రోడ్డుపైకి వెళ్లినా ఎవరూ గుర్తుపట్టలేదన్న జగపతిబాబు.
- మార్చి 27న విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్ 30కి వాయిదా.
- త్వరలో ‘పెద్ది’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది.
జగపతిబాబు ‘పెద్ది’ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన గెటప్ ఎంతలా ఉందంటే, ఆ గెటప్‌లో బయటకు వెళ్లినా ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
అప్పల సూరిగా జగపతిబాబు అద్భుత రూపం!
Jagapati Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈయన హీరోగా కంటే కూడా విలన్ పాత్రల ద్వారానే మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న జగపతిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన పెద్ది(Peddi Movie) సినిమాలోని అప్పల సూరి (Appala Soori)పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నారు అయితే ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఈ సినిమాలో ఈయన పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే పెద్ది సినిమా నుంచి జగపతిబాబు పాత్రను పరిచయం చేస్తూ ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ముసలి తాత పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇకపోతే తాజాగా జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుతో కలిసి అప్పలసూరి పాత్రలో జగపతిబాబు ఉన్న ఫోటోని కూడా చిత్ర బృందం విడుదల చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జగపతిబాబు అప్పలసూరి పాత్ర గురించి మాట్లాడుతూ ఒకరోజు తాను పెద్ది సినిమా సెట్ నుంచి అప్పలసూరి గెటప్ లో రోడ్డుపైకి వచ్చానని తెలిపారు.
‘పెద్ది’ సినిమా విడుదల తేదీ వాయిదా!
రోడ్డు పక్కన ఒక టీ కొట్టు ఉండడంతో అక్కడికి వెళ్లానని అయితే అక్కడ ఎవరు తనని జగపతిబాబు అంటూ గుర్తించలేదని తెలియజేశారు. మేము ఈ సన్నివేశాన్ని రికార్డ్ చేశామని, చాలా అద్భుతంగా ఉందని జగపతిబాబు తెలిపారు . అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ వీడియోని మీ అందరితో పంచుకుంటాను అంటూ జగపతిబాబు అప్పల సూరీ పాత్ర గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా మార్చి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
హోలీ సందర్భంగా సెకండ్ సింగిల్..
సెకండ్ సింగిల్ విడుదలUpdate
ఈ సినిమా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు షూటింగ్ పనులను పూర్తి చేస్తూనే మరోవైపు ప్రమోషన్లను కూడా చిత్ర బృందం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
జగపతిబాబు అప్పల సూరి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.


