|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైష్ణవి చైతన్య సంచలనం: కోలీవుడ్‌లో బేబీ సత్తా చాటేందుకు సిద్ధం!

Published: 25-02-2026, 10:35 AM
వైష్ణవి చైతన్య సంచలనం: కోలీవుడ్‌లో బేబీ సత్తా చాటేందుకు సిద్ధం!
  • వైష్ణవి చైతన్య కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్‌తో కలిసి నటించనున్నారు.
  • బేబీ సినిమా సక్సెస్‌తో వైష్ణవికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
  • ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమాలో వైష్ణవి నటిస్తున్నారు.
  • అజిత్ నటించిన వలిమై సినిమాలో వైష్ణవి చిన్న పాత్రలో కనిపించారు.

సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వైష్ణవి చైతన్య, బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.

కోలీవుడ్‌లో వైష్ణవి చైతన్య ఎంట్రీ

Vaishnavi Chaitanya: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా మంచి సక్సెస్ అందుకని ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్న వారిలో నటి వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమెకు బేబీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వైష్ణవి చైతన్య తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసినదే.

ఇలా తెలుగులో మాత్రమే కాకుండా వైష్ణవి చైతన్య తమిళ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈమె పాపులర్‌ కోలీవుడ్‌ కంపోజర్‌ కమ్‌ యాక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించి అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని, వైష్ణవి చైతన్య కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు బయటకు వస్తున్నాయి.

బేబీ సినిమాతో వచ్చిన గుర్తింపు

వైష్ణవి చైతన్య జీవి ప్రకాష్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. వైష్ణవి చైతన్య ఇదివరకు తమిళంలో ప్రముఖం స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఇలా ఈ సినిమాలో క్యామియో చేసిన వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాన్ని అందుకోబోతున్నారు. తమిళంలో ఈ సినిమా వైష్ణవి చైతన్యకు హీరోయిన్గా మొదటి సినిమా అవుతుందని చెప్పాలి.

మరోసారి ఆనంద్ జోడిగా వైష్ణవి చైతన్య.

తమిళంలో హీరోయిన్‌గా మొదటి సినిమా

బేబీ సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ సౌత్ ఇండియా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. వైష్ణవి చైతన్య ఇటీవల నటుడు సిద్దు జొన్నలగడ్డతో కలిసి జాక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నిరాశపరచడంతో ఈమె తిరిగి మరోసారి ఆనంద్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (Epic – First Semester) అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వైష్ణవి చైతన్య కోలీవుడ్‌లో ఏ విధంగా రాణిస్తారో చూడాలి. బేబీ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.